Injured Tiger: వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయపడిన పెద్దపులి క్షేమం.! వీడియో.
వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయపడిన పెద్దపులి క్షేమంగా తిరిగి అడవిలోకి చేరుకుంది. ఇటీవల నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలో ఓ పెద్దపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి తీవ్రంగా గాయపడింది. మూడేళ్ల వయసున్న ఆడపులి నడుము భాగంలో బైక్ క్లచ్ వైర్ లాంటిది బిగుసుకుని గాయపడింది. ఫిబ్రవరి 25న ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు.
వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయపడిన పెద్దపులి క్షేమంగా తిరిగి అడవిలోకి చేరుకుంది. ఇటీవల నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలో ఓ పెద్దపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి తీవ్రంగా గాయపడింది. మూడేళ్ల వయసున్న ఆడపులి నడుము భాగంలో బైక్ క్లచ్ వైర్ లాంటిది బిగుసుకుని గాయపడింది. ఫిబ్రవరి 25న ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. పులి తీవ్రంగా గాయపడి ఇబ్బంది పడుతున్న విషయం నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆ పులికి వెంటనే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. పూణెకు చెందిన ఐదుగురితో కూడిన రెస్క్యూ బృందంతోపాటు అటవీశాఖ ఉద్యోగులు, ప్రొటెక్షన్ వాచర్లు కలిసి మార్చి 5న పులిని గుర్తించి మత్తుమందు ఇచ్చి బంధించారు. ఆపై బైర్లూటిలోని వన్యప్రాణి వైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. నాలుగు రోజుల తర్వాత పులి కోలుకోవడంతో శుక్రవారం రాత్రి దానిని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ విషయాన్ని అటవీ అధికారులు నిన్న వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

