ముందు నుయ్యి వెనుక గొయ్యి.. పాపం జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే

ముందు నుయ్యి వెనుక గొయ్యి.. పాపం జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే

Phani CH

|

Updated on: Jul 05, 2022 | 7:48 PM

దూరం నుంచి చూస్తే అడవి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అక్కడ జీవనం నిత్యం సవాళ్లే. వాటిని దగ్గరుండి చూసిన వారికే ఈ విషయం బాగా అర్థం అవుతుంది.

దూరం నుంచి చూస్తే అడవి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అక్కడ జీవనం నిత్యం సవాళ్లే. వాటిని దగ్గరుండి చూసిన వారికే ఈ విషయం బాగా అర్థం అవుతుంది. అడవిలో నివసించే జంతువులు మనుషుల కంటే ఎక్కువ ఇబ్బందులకు గురవుతుంటాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయాసలు పడుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు జింకలు తమ ప్రాణాలను పణంగా పెట్టి కొండపై నిలబడి ఉన్నాయి. వాటి వెనకాలే రెండు తోడేళ్లు ఉన్నాయి. అవి ముందడుగు వేస్తే కొండపై నుంచి కింద పడిపోతాయి. వెనకడుగు వేస్తే తోడేళ్లు తినేస్తాయి. ఇదే సమయంలో తోడేళ్లు కూడా కొండపై నుంచి పడిపోతామేమోనని భయపడుతుండటం తెలుస్తోంది. అందుకే వాటి ముందు టార్గెట్ ఉన్నా అవి వాటిని చంపేందుకు సాహసం చేయడం లేదు. కాగా జింకల పని ఎప్పుడైనా ఇక్కడితో ముగిసిపోవచ్చని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెల్ఫీ కోసం ముప్పు తిప్పలు పడ్డ పవన్ సార్.. వైరల్ అవుతున్న వీడియో

Viral: పండ్లమ్మి అమ్మి కూడా పాపులర్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన ఫ్రూట్ సెల్లర్

హాలీవుడ్‌ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..

ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును భలే రక్షించాడు

కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్

 

Published on: Jul 05, 2022 07:34 PM