Video Viral: అదితినే కాదు మేము కూడా గోల్ఫ్ ఆడతాం అంటున్న ఎలుగుబంట్లు.. వీడియో వైరల్

|

Aug 11, 2021 | 10:59 AM

Video Viral: సోషల్ మీడియా, ఇంటర్నెట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎటువంటి వింత సంఘటనలు జరిగినా వెంటనే ప్రపంచ వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా తమ పెంపుడు జంతువులు..

Video Viral: అదితినే కాదు మేము కూడా గోల్ఫ్ ఆడతాం అంటున్న ఎలుగుబంట్లు.. వీడియో వైరల్
Golf Course
Follow us on

Video Viral: సోషల్ మీడియా, ఇంటర్నెట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎటువంటి వింత సంఘటనలు జరిగినా వెంటనే ప్రపంచ వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా తమ పెంపుడు జంతువులు చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలను చిత్రీకరించి.. ఆ వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమ సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటున్నారు. ఆ వీడియోలు ఎంతగానో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా గోల్ఫ్ కోర్టులో ఎలుగుబంటి పిల్లలు ఆడుకుంటున్న ఓ వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు.

గోల్ఫ్ కోర్స్‌లో మూడు ఎలుగుబంటి ఆడుకుంటూ చేస్తున్న సందడి వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. 40 సెకన్ల వీడియో ఇప్పటికే ట్విట్టర్ లో లక్షల వీక్షకులను కట్టిపడేసింది. ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి పెరటిలో అమర్చిన బర్ద్ ఫీడర్ లో నీరు తగినట్లు కనిపిస్తుంది. మూడు ఎలుగుబంట్లు పచ్చని తోటలో ఆడుకుంటున్నాయి. మూడు ఎలుగుబంటి పిల్లలు ఒకదాని వెనుక ఒకటి పరుగెత్తుతున్నాయి. వాటిలో ఒకటి గోల్ఫ్ కోర్సులలో కనిపించే ఫ్లాగ్ స్టిక్ ను పట్టుకుని.. ఆడుకుంటుంది. మరో రెండు ఎలుగుబంట్లు కుస్తీ పట్లు పడుతూ ఆడుకుంటున్నాయి. ఈ వీడియో డానీ డెరానీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కుటిస్ గోల్ఫ్ కోర్టులో చేస్తున్న సందడి చూస్తుంటే సరదాగా అనిపిస్తుంది. ఈ బేబీ బేర్స్ ఆడుకుంటుంటే.. నా పెదవులపై చిరునవ్వు ఇచ్చిన వీటికి ధన్యవాదాలని తెలిపారు.

Also Read:  Andal Tirunakshtram: కల్పవల్లి ఆండాళ్ తల్లి.. శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి పుట్టిన రోజు నేడు