నేటి తరానికి స్ఫూర్తి ఈ జంట.. పానీపూరి బండి నడుపుతున్న మూగ, చెవిటి దంపతులు
కార్యదీక్ష ఉండాలి గానీ ఏదైనా సాధ్యమని నిరూపిస్తోంది ఓ జంట.. నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వినికిడిలోపం ఉన్నా.. పానీ పూరి స్టాల్ ను నడుపుతున్నారు ఆ దంపతులు.
కార్యదీక్ష ఉండాలి గానీ ఏదైనా సాధ్యమని నిరూపిస్తోంది ఓ జంట.. నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వినికిడిలోపం ఉన్నా.. పానీ పూరి స్టాల్ ను నడుపుతున్నారు ఆ దంపతులు. మహారాష్ట్ర నాసిక్‌లోని అడ్గావ్ నాకాలో ప్రాంతానికి చెందిన మూగ చెవిటి కలిగిన దంపతులు తమకు జీవితంలో ఎదురైన సవాళ్లను చాలా దృఢ సంకల్పంతో ఎదుర్కొంటున్నారు. ఈ జంట పానీ పూరీ స్టాల్ నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దంపతులు ఇద్దరూ తమ స్టాల్ వద్ద సైగలతో కస్టమర్స్‌కు ఆహారపదార్ధాల గురించి వివరిస్తున్నారు. తమ బండి దగ్గరకు వచ్చే వినియోగదారులకు ఏమి కావాలన్నా.. సైగలతోనే అందిస్తున్నారు. సంజ్ఞల ద్వారానే చాట్‌లో మసాలా ఎక్కువ అయిందా.. సరిపోయిందా అంటూ కస్టమర్‌ని అడగి మరీ సర్వ్ చేస్తుంది. ఆమె కరకరలాడే పూరీలకు రుచిగల పుదీనా వాటర్‌ను జోడించి.. కస్టమర్లకు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నేటి తరానికి నిజమైన స్ఫూర్తిగా మీరు నిలిచారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ బుడ్డోడు చేసిన పనికి కోప్పడతారో.. నవ్వుకుంటారో మీ ఇష్టం
TOP 9 ET News: జగన్‌కు ఆయుధంలా మారిన RGV | బూతు మాటతో షాక్ చేసిన బాలయ్య
కిటికీ అంచున నిల్చుని క్లీనింగ్ చేస్తున్న మహిళ !! వణుకు పుట్టిస్తున్న సీన్
వేలానికి 41 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే !!
భార్యాభర్తల మధ్య మటన్ గొడవ.. మధ్యలో వచ్చిన వ్యక్తి దారుణ హత్య