భార్యాభర్తల మధ్య మటన్ గొడవ.. మధ్యలో వచ్చిన వ్యక్తి దారుణ హత్య
మాంసాహారం అంటే కొందరికి యమా ప్రీతి.. ఎప్పుడెప్పుడాని లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. అలానే ఓ వ్యక్తికి మాంసాహారం భలే ఇష్టం. ఇక ఇంటికి మటన్ తీసుకొచ్చాడు. కానీ భార్య వండేందుకు నిరాకరించింది.
మాంసాహారం అంటే కొందరికి యమా ప్రీతి.. ఎప్పుడెప్పుడాని లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. అలానే ఓ వ్యక్తికి మాంసాహారం భలే ఇష్టం. ఇక ఇంటికి మటన్ తీసుకొచ్చాడు. కానీ భార్య వండేందుకు నిరాకరించింది. మంగళవారం రోజు ఇంట్లో మటన్ వండుతావా? అంటూ ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధానిలో వెలుగు చూసింది. భోపాల్ లో పప్పు అర్హ్ వార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే తనకు ఇష్టమైన మటన్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. వండాలని భార్యను ఆదేశించాడు. కానీ మంగళవారం హనుమాన్ పూజిస్తానని మటన్ వండనని తేల్చిచెప్పింది. అసలు ఇంట్లోకి మటన్ ఎందుకు తెచ్చావని ప్రశ్నించింది. ఇక భర్తే వంట చేసేందుకు ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వీరి గొడవను పక్కింట్లో ఉండే బిల్లు అనే వ్యక్తి.. భార్యాభర్తలకు సర్దిచెప్పాడు. దీంతో తీవ్ర అవమానానికి గురైన పప్పు.. బిల్లును కర్రతో చావబాదాడు. తీవ్ర రక్తస్రావంతో బిల్లు.. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో ఎంత ధైర్యం.. ఏకంగా కింగ్ కోబ్రా నుదుట ముద్దు !!
విమానాన్ని గాలి కొదిలేసి.. నిద్రమత్తులో పైలట్లు !! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
పెళ్లికి లేట్‌గా వస్తున్న వరుడు.. నవ వధువు ఏం చేసిందో తెలుసా ??
గణితం సబ్జెక్ట్ అంటే భయమా ?? అయితే ఈ వీడియో చూడండి.. స్టూడెంట్స్ ఫుల్ ఖుషీ !!
ప్రాణం పోసుకుంటున్న ఈజిప్ట్ మమ్మీలు !! నెట్టింట వైలర్ అవుతున్న షాకింగ్ వీడియో
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

