ప్రాణం పోసుకుంటున్న ఈజిప్ట్ మమ్మీలు !! నెట్టింట వైలర్ అవుతున్న షాకింగ్ వీడియో
ఈజిప్ట్ మమ్మీలు అంటే తెలుసుకదా... ఉన్నట్టుండి వాటికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో ఊహించండి.... టెక్నాలజీ యుగంలో అసాధ్యం అనే మాటకు తావే లేదు.
ఈజిప్ట్ మమ్మీలు అంటే తెలుసుకదా… ఉన్నట్టుండి వాటికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో ఊహించండి…. టెక్నాలజీ యుగంలో అసాధ్యం అనే మాటకు తావే లేదు. ఇంపాజిబుల్ అనుకునే ఎన్నింటినో పాజిబుల్ చేస్తున్నారు మానవులు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి రూపం వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌అనే మాట ఎక్కువగా వినపడుతోంది. మానవుని మేధస్సుకి మెషీన్ వేగం తోడైతే ఊహించని ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఈ ఏఐని సరిగ్గా వాడుకున్నట్లయితే అలాంటి ఎన్నో ఫలితాలు వస్తాయని ఈ వీడియో రుజువుచేస్తుంది. హాలీవుడ్ మూవీ ‘మమ్మీ’ చూడని వాళ్లు ఉండరు. అలాగే ఈజిఫ్ట్ మమ్మీలంటే కూడా దాదాపు అందరికీ తెలుసు. ఈజిఫ్ట్ మనకు ఎప్పటికీ మిస్టరీయే. వేల సంవత్సరాల రాజుల శవాల్ని భద్రపరిచి పిరమిడ్స్ కట్టిన విధానం ప్రపంచాన్ని ఆశ్చర్చంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆ మమ్మీల ముఖ చిత్రాలు ఎలా ఉంటాయనే ఓ వీడియో ట్విటర్లో తిరుగుతోంది. ఈ వీడియోను వాలా అఫ్షర్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీన్ని చూసిన వేలాదిమంది నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

