AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచపు సహజసిద్ధమైన అద్భుతాలు ఇవే వీడియో

ప్రపంచపు సహజసిద్ధమైన అద్భుతాలు ఇవే వీడియో

Samatha J
|

Updated on: Aug 01, 2025 | 6:39 PM

Share

ప్రపంచ వింతలంటే టక్కున గుర్తొచ్చేవి – సెవెన్ వండర్స్. తాజ్ మహల్, చైనా వాల్ తదితరాల కట్టడాలన్నీ మానవ నిర్మితాలే. అయితే, ప్రకృతి సిద్దంగా ఏర్పడిన కొన్ని అద్భుత ప్రదేశాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.గ్రాండ్‌ కాన్యన్‌ .. అమరికాలోని అరిజోనాలో ఉన్న అతిపెద్ద లోయ ఇది. కొలరాడో నది సృష్టించిన ఈ లోయ.. దాదాపు 446 కి.మీ పొడవు, 29 కి.మీ వెడల్పుతో 1.6 కి.మీ లోతు కలిగి ఉంది. దీని అద్భుతమైన రంగులు, భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి.

గ్రాండ్‌ కాన్యన్‌ .. అమరికాలోని అరిజోనాలో ఉన్న అతిపెద్ద లోయ ఇది. కొలరాడో నది సృష్టించిన ఈ లోయ.. దాదాపు 446 కి.మీ పొడవు, 29 కి.మీ వెడల్పుతో 1.6 కి.మీ లోతు కలిగి ఉంది. దీని అద్భుతమైన రంగులు, భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక.. రెండవది ఆస్ట్రేలియా పక్కనే ఏర్పడిన గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ అనే.. పగడపు ద్వీపం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు ద్వీపంగా గుర్తింపు పొందింది. 2,300 కి.మీ విస్తీర్ణం ఉన్న ఈ ద్వీపం అనేక సముద్ర జీవులకు ఆవాసం. మూడవ అద్భుతం.. దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌. ఈ ఉష్ణ మండల వర్షారణ్యం లక్షలాది జీవులకు ఆలవాలం. అంతేకాదు.. ప్రపంచం మీద అత్యధికంగా ఆక్సిజన్ అందించే అడవి కూడా ఇదే. ఈ అడవి చుట్టూ.. అమెజాన్‌ నది ప్రవహించటం మరో వింత. చూసి తీరాల్సిన మరో ప్రకృతి వింత.. విక్టోరియా జలపాతం. ఆఫ్రికాలోని జాంబియా–జింబాబ్వే దేశాల సరిహద్దులోని ఈ జలపాతం జంబేజీ నదిపై ఉంది. దీని వెడల్పు 1.7 కిలోమీటర్లు కాగా.. ఎత్తు 108 మీటర్లు. చూసి తీరాల్సిన మరో వింత.. అరోరా బోరియాలిస్‌.

మరిన్ని వీడియోల కోసం :

మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్‌ వీడియో

డెలివరీ బోయ్స్‌గా షాపులోకి ఎంట్రీ.. కట్‌చేస్తే

అదృష్టమంటే ఇదే.. ఒకేసారి 8 వజ్రాలు దొరికాయ్‌ వీడియో

అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి వీడియో