AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి వీడియో

అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి వీడియో

Samatha J
|

Updated on: Jul 30, 2025 | 1:28 PM

Share

చిన్న పిల్లలు ఉండే ఇంట్లో సందడే వేరు. ఎప్పుడూ అటూ ఇటూ పరుగెడుతూ, అందినవాటిని లాగి పడేస్తూ అమ్మను తెగ విసిగిస్తారు. ఆ తల్లి వారిని దండించలేక.. పదే పదే పనులు చేసుకోలేక సతమతమవుతూ ఉంటుంది. అయినా కల్లాకపటం తెలియని ఆ చిన్నారులను చూడగానే తమ శ్రమనంతా మర్చిపోతుంది. ఇది మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుంది. ఓ బుల్లి చింపాంజీ తన తల్లిని విసిగిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ జూలోని తన డెన్‌లో తల్లి చింపాంజీ గడ్డిని పాన్పులాగా సర్దుతుంటుంది. ఇంతలో అక్కడికి తన బేబీ చింపాంజీ పరుగెత్తుకుంటూ వచ్చింది. నేనూ సర్దుతాను అన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చింది. తల్లి చింపాంజీ సరే సర్దు అన్నట్టుగా చూసింది. ఆ చిట్టి చింపాంజీ గడ్డి సర్దక పోగా తల్లి చక్కగా పోగేసిన గడ్డిని చిందరవందరగా చల్లేసి అక్కడినుంచి పరుగెత్తింది. అది చూసి తల్లి చింపాంజీ అయ్యో దేవుడా.. అన్నట్టుగా తన రెండు చేతులతో తలపట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ గడ్డినంతా సర్దుకుంది. ఈ వీడీయో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈవీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు పెడుతున్నారు. చిట్టి చింపాంజీ అల్లరి మామూలుగా లేదుగా అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో

వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో

ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్‌ చేసిన పనితో వీడియో