State govt: ఊరిని ఓ ప్రైవేటు కంపెనీకి అమ్మేసిన రాష్ట్ర ప్రభుత్వం.. దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు.. వీడియో
ఏ ఊర్లో అయినా భూతగాదాలు సర్వసాధారణం. ఆస్తి పంపకాలు, సరిహద్దు వివాదాలు, గెట్టు పంచాయితీలు వంటివి మనం చూస్తూనే ఉంటుంటాం. ఓ గ్రామం పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం.
ఏ ఊర్లో అయినా భూతగాదాలు సర్వసాధారణం. ఆస్తి పంపకాలు, సరిహద్దు వివాదాలు, గెట్టు పంచాయితీలు వంటివి మనం చూస్తూనే ఉంటుంటాం. కానీ జార్ఖండ్‌లోని ఓ గ్రామం పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. ప్రభుత్వమే వారి ఊరిని ఓ ప్రైవేటు కంపెనీకి అమ్మేసింది. ఈ విషయం 6 నెలల తర్వాత గానీ గ్రామస్థులకు తెలియలేదు. భూ వివాదంతో గర్వా జిల్లాలోని సునీల్ ముఖర్జీ నగర్ అనే గ్రామం అతలాకుతలమైపోయింది. దాన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వమే ఆ గ్రామాన్ని ప్రైవేటు కంపెనీకి అమ్మేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామ ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 465 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సునీల్ ముఖర్జీ నగర్‌లో 250 కుటుంబాలు.. మూడు దశాబ్దాలుగా జీవిస్తున్నాయి. ఆ భూమంతా గ్రామంలోని ప్రజల ఆధీనంలో ఉన్నప్పటికీ వారి వద్ద సరైన పత్రాలు లేవు. దీంతో రోడ్డు, నీరు, విద్యుత్తు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ గృహ నిర్మాణం లాంటి అనేక ప్రభుత్వ పథకాలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు గ్రామాన్నే విక్రయించేసరికి వీరంతా దిక్కుతోచనిస్థితిలో పడిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

