Smart dog: ఈ కుక్క చాలా తెలివైనది.. ఏంచక్కా అన్ని పనులు చేస్తోంది..!

Smart dog: ఈ కుక్క చాలా తెలివైనది.. ఏంచక్కా అన్ని పనులు చేస్తోంది..!

Anil kumar poka

|

Updated on: Jun 09, 2022 | 9:27 AM

జంతువులు చాలా తెలివైనవి.. అందులో కుక్క పిల్లలు మరింత ఎక్కువ. వీటికి మనుషులతో కాస్తా చనువు కూడా ఎక్కువే. చాలా మంది ఇళ్లలో కుక్క పిల్లలు అనేక మంది పెంచుకుంటుంటారు. అయితే కుక్క పిల్లలు, పిల్లులు,


జంతువులు చాలా తెలివైనవి.. అందులో కుక్క పిల్లలు మరింత ఎక్కువ. వీటికి మనుషులతో కాస్తా చనువు కూడా ఎక్కువే. చాలా మంది ఇళ్లలో కుక్క పిల్లలు అనేక మంది పెంచుకుంటుంటారు. అయితే కుక్క పిల్లలు, పిల్లులు, కోతులు చేసే ఫన్నీ చెష్టలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెంపుడు జంతువులు వాటి యజమానులతో ఉండడం ద్వారా మరింత తెలివైనవిగా మారతాయట. మనుషులు చేస్తున్నదంతా తాము చేయాలని అనుకుంటాయి. ఈ క్రమంలో అవి చేసే పనులు చూస్తూంటే ముచ్చటేస్తుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్‌లో వైరల్‌గా మారింది. ఇందులో కుక్క తెలివితేటలను చూసి మీరు మెచ్చుకోకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక కుక్క తలుపు తెరిచి గదిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత తలుపు కూడా మూసివేస్తుంది. అనంతరం మంచం మీదకు ఎక్కి, పడుకోవడానికి దుప్పటి వేసింది. దీని తరువాత, తన గోళ్లతో మంచం పక్కన ఉంచిన టేబుల్ ఫ్యాన్‌ను ఆన్ కూడా చేస్తుంది.

చూశారుగా ఈ కుక్క చాలా తెలివైనదో..నిద్రకు ఉపక్రమించే ముందు గదిలోని లైట్లన్నీ ఆర్పివేసి, ఫ్యాన్ నుంచి గాలి వీచినప్పుడు మంచం ఎక్కి అదే దిక్కున కూర్చోని ఉండిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. దీన్ని ఫేస్‌బుక్ పేజీ “డాగ్ లవర్స్”లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.2 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియోను వేలాది మంది వినియోగదారులు కూడా లైక్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 09, 2022 09:27 AM