Morning walk: తన మార్నింగ్ వాక్ కోసం రోడ్డు బ్లాక్ చేసిన ట్రాఫిక్ పోలీస్ వైరల్‌గా..! హల్ చల్ చేస్తున్న వీడియో..
వీఐపీలు, రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు రోడ్లను బ్లాక్ చేయడం కామన్. ఆ సమయంలో అందరూ రోడ్లపై నిలిచిపోతుంటారు. కానీ ఓ పోలీస్ అధికారి తన మార్నింగ్ వాక్ కోసం రోడ్డును బ్లాక్ చేశాడు.
వీఐపీలు, రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు రోడ్లను బ్లాక్ చేయడం కామన్. ఆ సమయంలో అందరూ రోడ్లపై నిలిచిపోతుంటారు. కానీ ఓ పోలీస్ అధికారి తన మార్నింగ్ వాక్ కోసం రోడ్డును బ్లాక్ చేశాడు. దాంతో పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ ఏసీపీ వినోద్ పిళ్లై, క్వీన్స్ వాక్‌వేలో మార్నింగ్ వాక్ చేయడానికి ఉదయం ఆరు నుంచి ఏడు వరకు రోడ్లను మూసివేస్తున్నారు. ఆ సమయంలో పిల్లలు సైకిల్ తొక్కడం, స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడం వంటివి మానుకుంటున్నారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ట్రాఫిక్‌ను మళ్లించడం, రోడ్డు మధ్యలో ట్రాఫిక్ నియంత్రించే పరికరాలను పెట్టడం వంటివి ఫోటోల్లో కనిపించాయి. ఈ క్రమంలో ఉదయం పాఠశాలలకు వెళ్లే పిల్లలు వారిని బస్సుల్లో ఎక్కించే తల్లిదండ్రులు, ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. అలా రోడ్డును మూసేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు కూడా చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. స్పందించిన ఉన్నతాధికారులు అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

