Ice Flowers: వావ్.. అద్భుతం ఈ మంచుపూలు.. అద్భుతమైన వీడియో చూసి తీరాల్సిందే..
వింటర్ సీజన్‌లో శీతల ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురవడం, నదులు గడ్డకట్టుకుపోవడం చూస్తుంటాం. ఇటీవల అమెరికాలో మంచుతుఫాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు.
వింటర్ సీజన్‌లో శీతల ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురవడం, నదులు గడ్డకట్టుకుపోవడం చూస్తుంటాం. ఇటీవల అమెరికాలో మంచుతుఫాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు.అలాగే చైనాలోని ఈశాన్య ప్రాంతలో ఉన్న సోంఘ్వువా అనే నదిలో కూడా నీళ్లు గడ్డ కట్టాయి. నది పైభాగం అంతా మంచు పరుచుకుంది. అందులో ఎంతో అందంగా విచ్చుకున్న మంచుపూలు అందరినీ ఆకట్లుకుంటున్నాయి. సూర్యుని లేలేత కిరణాలు తాకగానే విచ్చుకున్న కలువల్లా ఆ మంచు పుష్పాలు మిరుమిట్లు గొలుపుతూ కనువిందు చేస్తున్నాయి. నార్వేకు చెందిన మాజీ దౌత్యాధికారి ఎరిక్ సొల్‌హీమ్ ఈ మంచుపుష్పాల ఫోటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఐస్ ఫ్లవర్స్ అద్భుతం అంటూ అతను ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. వావ్.. ఈ మంచుపుష్పాలు నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఐస్ ఫ్లవర్స్ ఏర్పడడం అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందని చైనాకు చెందిన పీపుల్స్ డెయిలీ వార్తా సంస్థ తెలిపింది. శీతాకాలం మొదట్లో ఉదయం పూట ఈ పూలు ఏర్పడతాయని చెప్పింది. ముత్యాల్లా మెరిసిపోతున్న ఈ మంచు పూలను చూసి సోషల్‌మీడియా యూజర్లు ఫిదా అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..