Lion attack: సింహంతో పరాచకాలెందుకు భయ్యా.. చూశావా ఏం జరిగిందో.. షాకింగ్ వీడియో.
యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఓ డైలాగ్ గుర్తుందా.. ‘పులిని చూడలంటే చూస్కో.. ఫొటో దిగాలనిపించిందనుకో కొంచె రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు..సరే చనివిచ్చింది
ఓ జూలో సందర్శకులు అక్కడున్న జంతువులను చూస్తూ వెళ్తున్నారు. అక్కడ ఓ బోనులో రెండు సింహాలు ఉన్నాయి. వాటిని దగ్గరగా చూసేందుకు సందర్శకులు చుట్టుముట్టారు వారిలో ఓ వ్యక్తి బోనులోకి చేయి పెట్టి సింహాన్ని సింహం మెడపైన నిమిరాడు. దాంతో ఆ సింహం.. సరేలే ఏదో సరదాపడుతున్నాడు ఈసారికి వదిలేద్దాం అనుకుని అతన్ని ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉంది. అతనిని గమనించిన పక్కనున్న మరో వ్యక్తి బోనులోని మరో సింహం తలపై చేయి పెట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ సింహం అతని చేతిని నోటిలోకి లాగేసుకుంది. ఊహించని ఈ చర్యతో అక్కడున్న వారంతా షాకయ్యారు. సింహం చేతిని కరవడంతో బాధతో విలవిల్లాడిపోయాడు ఆ వ్యక్తి. సింహం బారి నుంచి చేతిని విడిపించుకోవడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. సింహానికి భయపడి అక్కడున్న వారు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అయితే భయం, బాధతో గట్టిగా అరవడంతో తిక్క కుదిరిందా అన్నట్టు కాసేపటికి సింహం అతని చేతిని వదిలేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బోనులో ఉన్నా సింహం సింహమే.. ఇలాంటి తుంటరి పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. అంటూ కామెట్లు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడూ జరిగిందో క్లారిటీ లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..