Man like a wolf: ఇదేం ఖర్మరా సామీ.. నీ తిక్కకు ఓ లెక్కంటూ లేదా.? రూ.19 లక్షలు ఖర్చుచేసి మరి.. వీడియో.
ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని ఇందుకే అంటారేమో.. ఆ మధ్య ఓ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి .. తనకు కుక్కలా బ్రతకాలనుందని లక్షలు పోసి కుక్క కస్ట్యూమ్స్ తయారు చేయించుకున్నాడు.
ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని ఇందుకే అంటారేమో.. ఆ మధ్య ఓ జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి .. తనకు కుక్కలా బ్రతకాలనుందని లక్షలు పోసి కుక్క కస్ట్యూమ్స్ తయారు చేయించుకున్నాడు. రాత్రికి రాత్రి వైరల్ అయిపోయాడు. ఇప్పడు ఈ కుక్క బ్రతుకు నాకొద్దు బాబోయ్ అంటూ.. ఆ వేషం తీసేయడానికి రెడీ అవుతున్నాడట. ఇటీవల ఓ బ్రిటన్ టాబ్లాయిడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోకో అనే ఈ వ్యక్తి తను కుక్కల బ్రతకడం వల్ల తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధవులు ఏమనుకుంటున్నారో అనే ఫీలింగ్ తనను నిద్రపోనివ్వడంలేదట. దాంతో ఆ వేషానికి ఎండ్‌కార్డ్ వేద్దామని డిసైడ్ అయ్యాడట. ఇదిలా ఉంటే.. అదే జపాన్‌లో ఇంకో వ్యక్తి తనకు తోడేలులా ఉండాలనుందంటూ డబ్బు కుమ్మరించాడు. ఏకంగా 19 లక్షల రూపాయలు పైనే ఖర్చుచేసాడు. టోకో కోసం కుక్క కాస్ట్యూమ్స్ చేసిన జెప్పెట్ అనే కంపెనీయే ఈ తోడేలు సూట్ కూడా తయారుచేసిందట. అయితే ఇక్కడ వీడి బాధేంటంటే తను తోడేలులా నాలుగు కాళ్లతో నడవలేకపోతున్నాడట. అందుకని రెండుకాళ్లతోనే నడుస్తూ.. తన కల నెరవేరిందని చంకలు గుద్దుకుంటున్నాడు. ఇది చూసి నెటిజన్స్.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే.. ఒకరిని చూసి మరొకరు ఇలా తయారు అవుతున్నారంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కంపెనీకి మరిన్ని జంతువుల ముసుగులు కావాలంటూ ఆర్డర్‌లు పెడుతున్నారంట ఇదంతా చూస్తున్న వాళ్లు. అందుకే అన్నారు.. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

