AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్.. అనిపిస్తున్న బయ్యారం జలపాతాలు వీడియో

వావ్.. అనిపిస్తున్న బయ్యారం జలపాతాలు వీడియో

Samatha J
|

Updated on: Aug 25, 2025 | 8:09 AM

Share

చుట్టూ పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. కొండల మధ్య స్వచ్చమైన నీటితో కిందికి దూకుతున్న జలపాతాలు.. వెరసి ప్రకృతి రమణీయతను చాటుతున్న బయ్యారం జలపాతాల అందాలు చూసేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు పొంగి పొర్లుతుండటంతో బయ్యారం చెరువు మత్తడి పోస్తోంది.

దీంతో పాండవుల గుట్ట జలపాతం, చింతోని గుంపులోని వంకమడుగు జలపాతాలు.. పొంగి పొర్లుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇక.. ఈ జలపాతాల వద్దకు చేరిన యువత.. పై నుంచి వేగంగా పడుతున్న జలధార కింద కేరింతలు కొడుతూ.. స్నానాలు చేస్తున్నారు. ఇంకొందరు తమ కెమెరాల్లో అక్కడి జలపాతాల అందాలను బంధించే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఏటా ఆగస్టు, సెప్టెంబరు నాటికి గానీ..పాండవుల గుట్ట జలపాతం, వంకమడుగు జలపాతాలు జలకళను సంతరించుకునేవి కాదనీ, ఈ ఏడాది.. నెల ముందే సందడి చేస్తున్నాయని అక్కడికొచ్చిన యువకులు తెలిపారు. ఇన్నాళ్లూ ప్రచారానికి దూరంగా.. కేవలం స్థానికులకే పరిచయమైన ఈ జలపాతాలు.. ఇప్పుడిప్పుడే పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. జలపాతం నుంచి వస్తున్న చల్లటి గాలులు, నీటి తుంపర్లు పర్యాటకుల మనస్సును పులకరింపజేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

బాబా వంగా జ్యోతిష్యం.. 2026లో మూడో ప్రపంచ యుద్ధం వీడియో

19 ఏళ్లకు వరించిన అదృష్టం.. వేల మందికి విందు వీడియో

సినిమాలపై సమంత కీలక నిర్ణయం.. ఇకపై..వీడియో

ఈ పురుగు దొరికితే పంట పండినట్లే.. వీడియో