Dogs attack: విరుచుకుపడుతున్న గ్రామ సింహాలు.. గుంపులుగా ఉంటూ రౌడీయిజం చేస్తున్న వీధి కుక్కలు..

|

Sep 20, 2022 | 9:15 AM

కేరళలో వీధి శునకాల బెడద ఎక్కువైపోయింది. గుంపులు గుంపులుగా తిరుగుతూ దారిన వెళ్లే వారిపై విరుచుకుపడుతున్నాయి. విచక్షణారహితంగా దాడిచేస్తున్నాయి. ఈ క్రమంలో జనం


కేరళలో వీధి శునకాల బెడద ఎక్కువైపోయింది. గుంపులు గుంపులుగా తిరుగుతూ దారిన వెళ్లే వారిపై విరుచుకుపడుతున్నాయి. విచక్షణారహితంగా దాడిచేస్తున్నాయి. ఈ క్రమంలో జనం ఇంటినుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. కోజికోడ్‌ జిల్లాలోని అరక్కినార్​లో సైకిల్​ వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. చేతులు, కాళ్లపై దారుణంగా కాట్లు వేసింది. బాలుడు ఎలాగో తప్పించుకునిపక్కనే ఉన్న ఇంట్లోకి పారిపోయాడు. కాగా, బాలుడిపై కక్ష కట్టిందా అన్న రేంజ్‌లో కుక్కు దాడి చేసింది. ఇక, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ ఆధారంగా దాడి జరిగిన ఘటన బయటకు వచ్చింది. అలాగే, కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధి కుక్కలు తరిమిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రోడ్డుపై నడిచి వెళ్తున్న విద్యార్ధులపై దాడికి ప్రయత్నించాయి. ఈక్రమంలో విద్యార్థులను తరుముకొచ్చాయి. భయంతో విద్యార్థులు పరిగెత్తుకుని వచ్చి.. సమీపంలోని ఇంటి గేటులోపలికి వెళ్లి కుక్కల దాడినుంచి తప్పించుకున్నారు. అదే ప్రాంతంలో రాత్రి వేళ నడిచి వస్తున్న వృద్ధుడిని పరుగులు పెట్టించాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. కేరళను డాగ్స్‌ ఓన్‌ కంట్రీ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 20, 2022 09:15 AM