Road accident: ఘోర ప్రమాదం.. సమయానికి రాని అంబులెన్స్‌.. జేసీబీలోనే బాధితుడిని ఆస్పత్రికి తరలింపు..(వీడియో)

రోజు రోజుకీ మానవత్వం నశించిపోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. సాటి మనిషి ప్రమాదానికి గురై ఆపదలో ఉన్నా సాయం చేసేందుకు ముందుకు రావడంలేదు కొందరు. అందుకే

Road accident: ఘోర ప్రమాదం.. సమయానికి రాని అంబులెన్స్‌.. జేసీబీలోనే బాధితుడిని ఆస్పత్రికి తరలింపు..(వీడియో)

|

Updated on: Sep 20, 2022 | 9:25 AM

రోజు రోజుకీ మానవత్వం నశించిపోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. సాటి మనిషి ప్రమాదానికి గురై ఆపదలో ఉన్నా సాయం చేసేందుకు ముందుకు రావడంలేదు కొందరు. అందుకే 108 సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ అంబులెన్స్‌ సిబ్బందికూడా సమయానికి స్పందించక జరగరాని ప్రమాదాలు జరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా బారాహీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మహేశ్‌ బర్మన్‌ అనే యువకుడి కాలు విరిగిపోయింది. స్థానికులు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అయితే స్థానికంగా అంబులెన్స్‌ అందుబాటులో లేదని, పక్కన ఉన్న మరో ఊరునుంచి పంపిస్తామని చెప్పారు. గంటలు గడుస్తున్నాయి. ఎంతకీ అంబులెన్స్‌ రాకపోవడంతో స్థానికులు ఆటోలో తీసుకెళ్దామని ఎందరిని అడిగినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవ్వరూ తమ ఆటోలో అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో పుష్పేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి తన జేసీబీలో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. దీనిని కొందరు వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల లేమికి ఇది నిదర్శమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ సభలో పాల్గొన్న సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 1445 నుంచి 2052కు పెరిగిందని చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ ఉన్న అంబులెన్సులు 75 నుంచి 167కు, బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ ఉన్నవి 531 నుంచి 835కు పెరిగాయని గొప్పగా ప్రకటించారు. అయితే రోగులు, వ్యాధిగ్రస్తులు, బాధితులకు సరైన సమయంలో అంబులెన్సులు అందుబాటులో లేని ఘటనలు రాష్ట్రంలో పెద్దసంఖ్యలో చోటుచేసుకున్నాయి. గత నెలలో ఓ పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భినిని జేసీబీలో తరలించిన ఘటన నీముచ్‌లో జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే