Elephant chase: బస్సును 8 కి.మీ వెంబడించిన ఏనుగు..! రివర్స్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్.. సూపర్ వీడియో.
ఏనుగు నుంచి ప్రయాణికులకు ప్రమాదం తప్పించేందుకు ఓ డ్రైవర్ ఏకంగా 8 కిలోమీటర్లు బస్సును వెనక్కి నడిపాడు. ప్రయాణికులు ఊపిరి బిగబట్టుకుని ఎలా బయటపడతామో
ఏనుగు నుంచి ప్రయాణికులకు ప్రమాదం తప్పించేందుకు ఓ డ్రైవర్ ఏకంగా 8 కిలోమీటర్లు బస్సును వెనక్కి నడిపాడు. ప్రయాణికులు ఊపిరి బిగబట్టుకుని ఎలా బయటపడతామో అని భయంతో వణికిపోయారు. ఎట్టకేలకు క్షేమంగా తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి తప్పిదానికి తావివ్వకుండా బస్సును వెనక్కి నడిపి తీసుకెళ్లిన డ్రైవర్‌ను ప్రయాణికులు అభినందించారు. ఈ ఘటన త్రిస్సూర్ జిల్లాలో తాజాగా జరిగింది.ఓ ప్రైవేట్ బస్సు కేరళలోని చాలకుడి-వల్పరై రూట్‌లో ఉదయం 9 గంటలకు వెళ్తున్నది. బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు. దట్టమైన అడవి గుండా మట్టిరోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఓ ఏనుగు వారి బస్సుకు అడ్డుగా వచ్చింది. ఘీంకరిస్తూ బస్సుపైకి పరిగెత్తుకొచ్చింది. ఈ మదగజం బారి నుంచి ప్రయాణికులకు ముప్పును గ్రహించిన డ్రైవర్ చాకచక్యంగా బస్సును వెనక్కి పోనిచ్చాడు. చాలా ఇరుకైన రోడ్డులో బస్సు వెనక్కి వెళ్తున్నకొద్దీ ఏనుగు కూడా దాన్నే అనుసరించింది. బస్సును తిప్పేందుకు స్థలం లేకపోవడంతో అంబలపర నుంచి అనక్కాయం వరకు బస్సును వెనక్కి నడిపి తీసుకొచ్చాడు.ఇలా గంటపాటు 8 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పాచిడెర్మ్ అనక్కాయం ప్రాంతంలో ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. దాంతో బస్సులోని వారంతా ఊపిరిపీల్చుకున్నారు. తమను ఏనుగు ముప్పు నుంచి తప్పించిన డ్రైవర్ అంబుజాక్షన్‌ను అభినందనల్లో ముంచెత్తారు. ఈ దారిలో గతంలో కూడా బస్సుపై ఏనుగులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయని ప్రయాణికులు గుర్తుచేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..