Tesla: 14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
ప్రముఖ కంపెనీలలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వనుంది. ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే కంపెనీవ్యాప్తంగా 14,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చు.
ప్రముఖ కంపెనీలలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వనుంది. ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే కంపెనీవ్యాప్తంగా 14,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఎలక్ట్రిక్.కామ్ ప్రకారం.. కంపెనీ భారీగా వృద్ధి చెందడం ఉద్యోగాల డూప్లికేషన్ కు దారితీసిందని సంస్థ అంతర్గత ఈమెయిల్ లో మస్క్ అభిప్రాయపడ్డారు. తదుపరి దశ అభివృద్ధికి కంపెనీని సిద్ధం చేసేందుకు అన్ని రకాలుగా ఖర్చులు తగ్గించుకొని ఉత్పాదకతను పెంచుకోవడం అత్యంత అవసరం అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సంస్థ పనితీరును సమీక్షించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను 10 శాతానికిపైగా తగ్గించాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నామని, ఉద్యోగులను తొలగించడంకన్నా నేను ద్వేషించే విషయం మరొకటి ఉండదు, కానీ దీన్ని అమలు చేయాల్సిందే అని ఈమెయిల్ లో మస్క్ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!