Air Travel: విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

Air Travel: విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

Anil kumar poka

|

Updated on: Apr 17, 2024 | 4:58 PM

విమానంలో ప్రయాణం అంటే వేలల్లో మాటే. వేలకు వేలు ఖర్చును భరించగలిగితే తప్ప విమానం ఎక్కలేం. ఇంతో అంతో ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు మాత్రమే విమానాల్లో ప్రయాణాలు చేయగలరు. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించే అవకాశం వచ్చింది. కేవలం రూ.349 ఛార్జితో విమానంలో ప్రయాణించవచ్చు. ఇంతకీ ఇంత చౌకగా విమాన ప్రయాణం ఎక్కడ అనుకుంటున్నారా?

విమానంలో ప్రయాణం అంటే వేలల్లో మాటే. వేలకు వేలు ఖర్చును భరించగలిగితే తప్ప విమానం ఎక్కలేం. ఇంతో అంతో ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు మాత్రమే విమానాల్లో ప్రయాణాలు చేయగలరు. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించే అవకాశం వచ్చింది. కేవలం రూ.349 ఛార్జితో విమానంలో ప్రయాణించవచ్చు. ఇంతకీ ఇంత చౌకగా విమాన ప్రయాణం ఎక్కడ అనుకుంటున్నారా? అసోంలోని లిలాబరి నుంచి తేజ్‌పూర్‌ మధ్య 50 నిమిషాల విమాన ప్రయాణానికి ఈ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఇందులో రూ.150 బేస్‌ ఛార్జీ కాగా.. కన్వినీయెన్స్‌ ఛార్జీ కింద రూ.199 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇంతకు మించి అదనంగా ఎటువంటి భారాలు ఉండవు.

ఈ ఒక్క మార్గంలోనే కాదు.. రూ.1000 కంటే తక్కువ బేస్‌ టికెట్‌ ధరతో దేశంలో పలు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ విమానాలన్నీ ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం కింద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ పథకం కింద విమానయాన సంస్థలకు పలు ప్రోత్సాహకాలు లభిస్తుండటమే ఈ చౌక ధరలకు కారణమని ట్రావెల్‌ పోర్టల్‌ ఐక్సిగో తెలిపింది. ఒక వ్యక్తికి రూ.1000 కంటే తక్కువ బేస్‌ ఛార్జీతో దేశంలో 22 విమాన మార్గాలు ఉన్నాయని, లిలాబరి- తేజ్‌పూర్‌ మధ్య అత్యల్పంగా రూ.150 బేస్‌ ఛార్జీతో అలయన్స్‌ ఎయిర్‌ విమానాలు నడుపుతోందని ఇక్సిగో వెల్లడించింది. టికెట్‌ బుకింగ్‌ సమయంలో బేస్‌ ఛార్జీకి అదనంగా కన్వీనియెన్స్‌ ఛార్జీ వసూలు చేస్తారు. ప్రాంతీయ అనుసంధానత పథకంలో నడిచే విమానాల సమయం దాదాపు 50 నిమిషాలు ఉంటుంది. రూ.150 నుంచి 199 బేస్‌ ఛార్జీ మార్గాలు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో ఈ శ్రేణిలో ధరలు బెంగళూరు-సేలం రూ.525లు, కొచ్చి-సేలం మార్గాల్లో ఉన్నాయి. గువాహటి- షిల్లాంగ్‌ మధ్య బేస్‌ టికెట్‌ ధర రూ.400గా ఉంది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!