భూమ్మీద నూకలుంటే.. ఇలాగే బయటపడతారు వీడియో
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి రైలు కింద నుండి దూరి పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా గూడ్స్ రైలు కదిలింది. ఏం చేయాలో తెలియక కంగారుపడుతున్న ఆ మనిషికి టక్కున ఓ ఆలోచన వచ్చింది. ఆ క్షణంలో ఆయనకు తట్టిన ఆలోచనే.. అతడిని మృత్యుంజయుడిని చేసింది.. అక్కడున్న వారంతా ఈ సంఘటనను సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఆగి ఉంది ఈ క్రమంలో ఎప్పటిలాగే రైలు పట్టాల కింద నుండి దూరి అవతల వైపు వెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. రైలు కింద నుండి దూరుతున్న క్రమంలో అకస్మాత్తుగా రైలు కదిలింది. దాంతో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఆ వ్యక్తి వెంటనే రైలు కింద పట్టాల మీద పడుకున్నాడు. అక్కడున్న వారంతా అతను రైలు కిందపడి చనిపోయాడు కావచ్చు అని కేకలు పెడుతున్నారు. కానీ అతను మాత్రం భయపడకుండా..సమయస్పూర్తితో వ్యవహరించి మృత్యువును జయించాడు. రైలు పట్టాలపై బోర్లా పడుకొని ఉండటంతో.. గూడ్స్ రైలు అతనిపైనుంచి వెళ్లినా ఆ వ్యక్తికి ఎలాంటి అపాయం జరగలేదు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

