వృక్షమాత కన్నుమూత వీడియో
ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తిమ్మక్క కన్నుమూసారు. 114 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా తిమ్మక్క తుదిశ్వాస విడిచారు. తన జీవితకాలంలో 65 ఏళ్లపాటు మొక్కలు నాటడానికే అంకితమయ్యారు. స్వయంగా రాష్ట్రపతే.. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఆమె కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారంటే ఆమె గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పర్యావరణ ప్రేమికురాలు.. కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క అందరికీ సుపరిచితమే. ముద్దుగా వృక్షమాత అని పిలుచుకుంటారు. పిల్లలు పుట్టలేదని ఒకప్పుడు సమాజం తిమ్మక్కను సూటిపోటి మాటలతో బాధించింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ భర్త అండగా నిలిచారు. ఆమెకు మొక్కలు నాటడంలో మెలకువలు నేర్పారు. అప్పటినుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టారు తిమ్మక్క. వాటికి ఆయువు పోసారు మొక్కలనే సొంత బిడ్డలుగా భావించి ప్రేమను పంచి మహా వృక్షాలుగా చేశారు. దాదాపు 8వేలకు పైగా మొక్కలు నాటి మహా వృక్షాలుగా చేశారు. కర్నాటకలో పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషిని గుర్తించిన కేంద్రం 2019లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అంతేకాదు, బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మక్క ఒకరిగా నిలిచారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ, ప్రకృతి ప్రేమికులు సంతాపం తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
