గుడి ఆవరణలో కనిపించిన ఈ రాయి.. పెద్ద గుట్టు విప్పింది వీడియో
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయునిపల్లి గ్రామంలో వెలసిన వీరాంజనేయస్వామి దేవాలయంలో పురాతన తెలుగు శాసనం వెలుగుచూసింది. ఇటీవల గుడి మరమ్మత్తు పనులు చేస్తుండగా.. కొమరోలు ఆవిర్భావానికి సంబంధించిన శాసనాన్ని గుర్తించారు. ఐదువందల ఏళ్ల క్రితం కొమరవెల్లిగా పిలుచుకునే పట్టణమే నేడు కొమరోలుగా మారిందని తెలుస్తోంది. ఈ విషయాలను తెలియచేసే 15వ శతాబ్దానికి చెందిన శిలాశాసనం ఆలయ ఆవరణలో లభ్యమైంది.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయుని పల్లి సమీపంలోని ప్రాచీన దేవాలయంలో 15వ శతాబ్దం నాటి శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిలా శాసనాల ఆధారంగా శ్రీరాముడు, సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు కొద్ది రోజులపాటు ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. సీతమ్మవారు స్నానమాచరించేందుకు రాములవారు ఆలయ సమీపంలో ఒక బావిని తవ్వించారని ఆ బావికి సీతమ్మ బావిగా నామకరణం చేశారని పేర్కొన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సీతమ్మ వారి పాదాలు ముద్రలు కూడా ఉన్నాయని, ఆలయంలో అమ్మవారు, వినాయకుడు, హనుమంతుడు, వీరభద్రుడు, నాగేంద్రుడు విగ్రహాలు 15వ శతాబ్దం నాటివని అర్చకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
