కృష్ణా నదిలో తృటిలో తప్పిన పడవ ప్రమాదం వీడియో
కృష్ణా నదిలో తృటిలో పడవ ప్రమాదం తప్పింది. వేదాద్రి నుంచి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు ప్రయాణిస్తున్న పడవలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బ్యాటరీ పనిచేయకపోవడంతో పడవ మార్గ మధ్యలో నిలిచిపోయింది. మరోవైపు నదీ ప్రవాహం వేగంగా ఉండడంతో పడవ కొంత దూరం కొట్టుకుపోయింది.. అది గమనించిన స్థానికులు పడవలో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుండి గుంటూరు జిల్లా గింజపల్లి వరకు ప్రతిరోజు ప్రయాణికులు పడవలపై రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. రోజూలాగే శుక్రవారం కూడా కొందరు బోటులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో బోటు ఇంజన్ బ్యాటరీ పనిచేయకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. కృష్ణానది ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పడవ కొంత దూరం కొట్టుకుపోయి నిలిచిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు బోటుకు లంగరు వేసి.. 30 మంది ప్రయాణికులతో సహా పడవని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని నిర్వాహకులు తెలిపారు. పడవలోని ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
