నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా జన్మించాడు. అయితే వీరి ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. కొంతకాలం అలాగే నెట్టుకొచ్చారు. ఈ క్రమంలోనే బాబు పుట్టాడు. అయినా గొడవలు ఆగలేదు. దీంతో ఇద్దరూ విడిపోయి వేరువేరుగా నివాసం ఉంటూ ఎవరి జీవనం వారు కొనసాగిస్తున్నారు. అది జీర్ణించుకోలేని భర్త కాపుకాసి నడిరోడ్డుమీద భార్యను గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది.
నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే సూర్యాపేట ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి. నూజివీడుకు చెందిన స్టాఫ్ నర్స్ సరస్వతి, విజయవాడకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ ఇద్దరు 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. ప్రస్తుతం రెండేళ్ల బాబుతో సరస్వతి వేరుగా నివాసం ఉంటుంది. 2022 ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్న ఇద్దరు కలకాలం కలిసిమెలిసి జీవిస్తారని భావిస్తే.. పెళ్ళైన నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనితో దాదాపు ఏడాదిన్నర కాలంగా సరస్వతి, విజయ్ వేరుగా నివాసం ఉంటున్నారు. భర్త విజయ్ పై వేధింపుల కేసు పెట్టింది సరస్వతి. దీనితో నూజివీడులో కేసు నమోదు కాగా 5 నెలలు జైలుకు సైతం వెళ్లొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. చాలాకాలంగా భార్యను చంపుతానని బెదిరిస్తున్న విజయ్ గురువారం సరస్వతి పని చేస్తున్న ఆసుపత్రికి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో విధులు ముగించుకొని వస్తున్న భార్యను వెంటాడి వెంటాడి కత్తితో పొడిచి హత్య చేశాడు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
