Tornado: సుడిగాలి బీభత్సం.. తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు, వాహనాలు.. వీడియోలు చూస్తే షాకే..!

Tornado: సుడిగాలి బీభత్సం.. తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు, వాహనాలు.. వీడియోలు చూస్తే షాకే..!

Anil kumar poka

|

Updated on: Jun 26, 2022 | 8:42 PM

దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరాన్ని శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసింది. భారత కాలమానం ప్రకారం..


దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరాన్ని శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసింది. భారత కాలమానం ప్రకారం.. జూన్‌ 19వ తేదీ ఉదయం 7 గంటల 20 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ట్విస్టర్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బీభత్సం సృష్టించిన ఈ సుడిగాలి ఒక్క నిమిషంలోనే విద్యుత్తు అంతరాయానికి కారణమైంది. ఈ సుడిగాలి తాకిడికి చెట్లన్నీ నేలకూలాయి. ఇళ్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా కొన్ని వీడియోలలో ఈ ట్విస్టర్ కారణంగా విద్యుత్ లైన్లు నేల కూలడమే కాకుండా ఆకస్మికంగా మంటలతో పాటు నిప్పురవ్వలు చెలరేగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఆకస్మిక ప్రకృతి ప్రకోపానికి భవనాలు, కార్లు, స్థానిక మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే గత వారం దేశాన్ని తాకిన రెండో సుడిగాలి ఇది. జూన్ 16న దక్షిణ మెగాసిటీ గ్వాంగ్‌జౌను మరో సుడిగాలి తాకింది. లక్షలాది మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. పెద్ద ఎత్తున ఆస్తులను నాశనం చేసింది. వ్యవసాయ భూములను చిత్తడి చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 26, 2022 08:42 PM