Viral Video: మూడ్ ఆఫ్‌లో ఉన్నారా..? అయితే ఈ వీడియో హ్యాపీగా నవ్వేస్తారు..! వీడి వేషాలు అలా ఉన్నాయి మరి..
జనరల్‌గానే పిల్లలు స్కూల్‌కు వెళ్లడానికి మారం చేస్తుంటారు. సెలవొస్తే చాలా వారికి పండుగలా ఉంటుంది. ఆదివారం ఇంట్లో ఉండి.. సోమవారం స్కూల్‌కు వెళ్లాలంటే ఎక్కడ లేని బద్దకాన్ని ప్రదర్శిస్తుంటారు. నానా రకాల నటనాచాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. తాజాగా ఓ బుడ్డోడికి
జనరల్‌గానే పిల్లలు స్కూల్‌కు వెళ్లడానికి మారం చేస్తుంటారు. సెలవొస్తే చాలా వారికి పండుగలా ఉంటుంది. ఆదివారం ఇంట్లో ఉండి.. సోమవారం స్కూల్‌కు వెళ్లాలంటే ఎక్కడ లేని బద్దకాన్ని ప్రదర్శిస్తుంటారు. నానా రకాల నటనాచాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. తాజాగా ఓ బుడ్డోడికి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వాడి యాక్టింగ్ ఫర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని రోడ్డువైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో స్కూల్ బస్సు రానే వచ్చింది. దాన్ని చూశాక ఆ బుడ్డోడిలోని కళాకారుడు బయటకొచ్చాడు. బలవంతంగానే.. స్కూల్ బస్సు వద్దుకు నడుచుకుంటూ వెళ్లాడు. బస్సుకు కొద్ది దూరంలో ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏమైందా అనుకునేలోపే.. రోడ్డుమీద వెళ్లకిలా పడుకున్నాడు. ఆ కుర్రాడు ఒక్కసారిగా అలా పడిపోవడంతో ఏమైందోనని కంగారు పడిన బస్కూలోని స్కూట్ అటెండర్.. చిన్నారి కోసం బస్సు దిగి వచ్చింది. అదిచూసి బుడ్డోడు వెంటనే అలర్ట్ అయి పైకి లేచాడు. ఆ చిన్నారిని తీసుకెళ్లి బస్సు ఎక్కించిందామె. అయితే, ఈ సన్నివేశాన్నంతా వీడియో చిత్రీకరించిన చిన్నారి పేరెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోమవారం వచ్చిందంటే ఇలా ఉంటుంది పరిస్థితి ఉంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బుడ్డోడి యాక్టింగ్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..