Strange noises: గుడిలో గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు.. భయాందోళనలో ఊరి ప్రజలు.. (వీడియో)

పార్వతీపురం మన్యం జిల్లాలో వింత శబ్దాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పల పోలమ్మ గుడిలో గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన..

Anil kumar poka

|

Aug 17, 2022 | 6:13 PM


పార్వతీపురం మన్యం జిల్లాలో వింత శబ్దాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పల పోలమ్మ గుడిలో గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అక్కడ ప్రస్తుతం ఏ పండగా లేదు.. జాతర అంతకంటే కాదు. కానీ ఈ గుడి దగ్గర చాలామంది గుమిగూడారు. పైగా లోపల ఏదో జరుగుతున్నట్టు ఒకరినొకరు తోసుకుంటూ గేటు దగ్గరకు వెళ్తున్నారు. చెవులు గేటుకు దగ్గరగా పెట్టి ఏదో వింటున్నారు. గుడిలో నుంచి పసుపు వాసనతో పాటు గాజులు, గజ్జెల మోతలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. వాటిని వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పల పోలమ్మ అనే దేవత చాలా శక్తి వంతమైనదని భక్తుల విశ్వాసం. అప్పుడప్పుడు గ్రామంలో చాలా మందికి పూనకం వస్తుందని.. అమ్మవారు తనకు కావాల్సింది అడిగి చేయించుకుంటుందని స్థానికులు చెబుతున్నారు.. అమ్మవారి కోరిక మేరకు జాతర కూడా జరుపుతుంటారు. ఈ సారి ఇంకా జాతర జరిపించకపోవడంతో.. అమ్మవారు ఇలా సంకేతాలు పంపిందని కొందరు భక్తులు నమ్ముతున్నారు. మరోవైపు గ్రామానికి ఏదో అరిష్టం జరగబోతోందని మరి కొంత మంది భయపడుతున్నారు. గుడిలో వింత శబ్దాల విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. ఆలయం దగ్గరకు చేరుకున్నారు. గుడిలో శబ్దాలు ఏంటి.. అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu