వామ్మో ఇవేంటి..? వలలో చిక్కినవి చూసి షాకైన జాలర్లు..వీడియో

Updated on: Apr 11, 2025 | 7:59 PM

కప్పలు మనకి తరచూ తారసపడుతూనే ఉంటాయి. పల్లెటూర్లు మాత్రమే కాదు.. సిటిల్లోనూ కనిపిస్తాయి. అయితే వర్షాలు పడిన సమయంలో కొన్నిసార్లు.. పెద్ద పెద్ద లావైన పసుపు పచ్చ కప్పలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఇండియన్ బుల్ ఫ్రాగ్ జాతి కప్పలు. ముళ్ల కప్పల్ని ఎప్పుడైనా చూశారా? అవును ఈ కప్పల ఒళ్లంతా ముళ్లే ఉన్నాయి. ఈ వింత కప్పలు జనాల్ని ఆశ్చర్యానికి చేస్తున్నాయి.

విశాఖ నగరం రుషికొండ తీరంలో ఏప్రిల్ 7న మత్స్యకారుల వలకు ఈ ముళ్ల కప్పలు చిక్కాయి. సముద్రంలో ఏవైనా ఇతర జీవులు తమపై దాడి చేసినప్పుడు శరీరంపై ఉన్న ముళ్ల సాయంతో ప్రతిఘటించి.. ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాయని జాలర్లు చెబుతున్నారు. ఈ కప్పల ముళ్లు గుచ్చుకుంటే మాత్రం నొప్పి తీవ్రత చాలా దారుణంగా ఉంటుందంటున్నారు. సాధారణంగా వలలకు చిక్కే ఈ తరహా జీవుల్ని మత్స్యకారులు తిరిగి సముద్రంలోనే వదిలిపెడుతూ ఉంటారు. అలా చేస్తేనే జీవ వైవిధ్యం బాగుంటుందని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం 

భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో

వేసిన సీల్‌ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్‌

పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో

కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వీడియో