విమానంలో పని చేయని ఏసీ.. ప్రయాణికుల అవస్థలు

|

Jun 22, 2024 | 12:25 PM

విమానంలో సాంకేతిక లోపాలు, అనుచిత ఘటనలు, బెదిరింపు కాల్స్‌ వంటివి త‌రుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ విమానంలో ఏసీ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక ఉక్కపోత‌తో కొందరు అవస్థలు పడ్డారు. ఈ ఘ‌ట‌న స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది. బుధవారం న్యూ ఢిల్లీ నుంచి దర్బంగా వెళుతున్న విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు.

విమానంలో సాంకేతిక లోపాలు, అనుచిత ఘటనలు, బెదిరింపు కాల్స్‌ వంటివి త‌రుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ విమానంలో ఏసీ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక ఉక్కపోత‌తో కొందరు అవస్థలు పడ్డారు. ఈ ఘ‌ట‌న స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది. బుధవారం న్యూ ఢిల్లీ నుంచి దర్బంగా వెళుతున్న విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేష‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల గాలి కోసం తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కనిపించారు. వృద్ధులు చిన్నపిల్లలతో సహా అనేక మంది ప్రయాణీకులు ఉక్కపోత‌తో అవస్థలు ప‌డ్డారు. విమానంలోని పరిస్థితిని తోటి వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. తాను ఢిల్లీ నుంచి దర్భంగాకు స్పైస్ జెట్‌లో ప్రయాణిస్తున్నాననీ ఢిల్లీ విమానాశ్రయంలో చెక్ ఇన్ తర్వాత గంట వ‌ర‌కు ఏసీ ఆన్ చేయ‌లేదని ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేశాడు. విమానం లోప‌ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉందనీ విమానం టేకాఫ్‌ కాగానే ఏసీ ఆన్ చేశారని ప్రయాణికుడు రోహన్‌కుమార్ తెలిపారు. వీడియోపై స్పందించిన విమానయాన సంస్థ .. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలకు రైళ్లలో ఉన్న సదుపాయాలు ఏంటో తెలుసా ??

రూ.90 వేల మామిడిపండుతో దేవుడికి నైవేద్యం

ఈ పొడిని నూనెలో కలిపి రాయండి.. క్షణాల్లో తెల్ల జుట్టు నల్లగా

ఆన్‌లైన్‌లో ఎక్స్‌బాక్స్‌ ఆర్డర్‌.. పార్సిల్ ఓపెన్ చేయగా ఒక్కసారిగా పైకి లేచిన పాము

విమానంలో తోటి ప్రయాణికులతో గొడవ !! సిబ్బందిని కొరికిన మహిళ !!