స్టార్ట్‌ కాకుండా మొరాయించిన స్కూటీ.. చెక్‌ చేసిన బైకర్‌కు షాక్‌

స్టార్ట్‌ కాకుండా మొరాయించిన స్కూటీ.. చెక్‌ చేసిన బైకర్‌కు షాక్‌

Phani CH

|

Updated on: Jul 28, 2023 | 7:44 PM

సాధారణంగా పార్కింగ్‌ ఏరియా లేకనో, మరో కారణంతోనో టూ వీలర్స్‌ను ఇంటి బయట ఆవరణలో పార్క్‌ చేస్తుంటారు కొందరు. ఇలా ఇంటిబయట వాహనాలు పార్క్‌ చేసేవారికి హడలెత్తించే ఓ ఇన్సిడెంట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వణికిపోతున్నారు.

సాధారణంగా పార్కింగ్‌ ఏరియా లేకనో, మరో కారణంతోనో టూ వీలర్స్‌ను ఇంటి బయట ఆవరణలో పార్క్‌ చేస్తుంటారు కొందరు. ఇలా ఇంటిబయట వాహనాలు పార్క్‌ చేసేవారికి హడలెత్తించే ఓ ఇన్సిడెంట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వణికిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందనేగా మీ అనుమానం.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బయటకు వెళ్లేందుకు తన ఇంటి బయట పార్క్ చేసిన స్కూటీని స్టార్ట్ చేయబోయాడు. అది స్టార్ట్‌ కాకుండా మొరాయించింది. అంతేకాదే అలా స్టార్ట్‌ చేసినప్పుడల్లా ఆ బైక్‌ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. దాంతో అనుమానం వచ్చిన అతను చెయగా బ్రేకుల మధ్యలో నల్లటి ఆకారం కదులుతూ కనిపించింది. ఏమై ఉంటుందా అని పరిశీలనగా చూసిన అతని గుండె గుభేలంది. ఆ బ్రేకుల మధ్‌యలో భారీ నాగుపాము చుట్టుకుని ఉంది.