ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్‌ వీడియో

Updated on: Mar 11, 2025 | 2:32 PM

ఇటీవల విమానాల్లో తరచూ చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఏదో కారణంతో విమానాలు క్యాన్సిల్‌ అవడమో.. అత్యవసర ల్యాండింగ్‌ అవడమో.. సాంకేతిక లోపంతో ప్రమాదాల్లో చిక్కుకోవడమో జరుగుతున్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో చాలానే చూస్తుంటాం. తాజాగా టాయిలెట్‌ కారణంగా 10 గంటలు గాల్లో ప్రయాణించిన తర్వాత విమానం ఒక్కసారిగి వెనక్కి మళ్లింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

షికాగో నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాదాపు 10 గంటలు ప్రయాణించిన అనంతరం తిరిగి విమానాన్ని షికాగోకు మళ్లించినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. అందులోని టాయిలెట్లు మూసుకుపోయాయని, దాంతో విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 340 మంది ప్రయాణికులతో మార్చి 6న, బోయింగ్‌ 777-337 ఈఆర్‌ విమానం షికాగోలోని ఓఆర్‌డీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానంలో పది మరుగుదొడ్లు ఉన్నాయి. విమానం బయలుదేరిన తర్వాత వీటిలో ఒక్క టాయిలెట్‌ మాత్రమే పనిచేస్తున్నట్టు గుర్తించారు సిబ్బంది. అప్పటికే విమానం గాల్లో పది గంటలు ప్రయాణించింది. అయినా లోపాన్ని గుర్తించిన వెంటనే విమానాన్ని తిరిగి షికాగోకు మళ్లించారు. సాంకేతిక కారణాలతో విమానాన్ని తిరిగి వెనక్కి పంపించినట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. ల్యాండ్‌ అయిన తర్వాత ప్రయాణికులు, సిబ్బందికి బస కల్పించామని, వారి గమ్యస్థానం చేరేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎవరైనా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని, రీషెడ్యూల్‌కూ అవకాశం కల్పించామన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్‌ .. తర్వాత వీడియో

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో

పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్‌.. వీడియో

యుద్ధ విమానాలు వద్దట..ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక కారణం ఏంటి?వీడియో

 

Published on: Mar 11, 2025 02:32 PM