బాహుబలిలో ప్రభాస్ లాగా శివలింగాన్ని పెకిలించేశారు

Updated on: Mar 04, 2025 | 4:58 PM

మహా శివరాత్రి వేళ దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా దేవాలయంలో ఉన్న శివలింగాన్నే ఎత్తుకుపోయారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ పెకిలించి తీసుకెళ్లినట్లు తీసుకెళ్లారు. పురాతన ఆలయంలోని రాతి శివలింగం చోరీకి గురి కావడం కలకలం రేపుతోంది. శివరాత్రి రోజున ఆలయాన్ని తెరిచిన పూజారి.. లోపల శివలింగం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శివలింగాన్ని ఎవరు ఎత్తుకెళ్లారు అనేది తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రం ద్వారక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున శ్రీ భిద్భంజన్ భవనీశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఘోరం జరిగింది. ఈ పురాతన ఆలయంలో రాతి శివలింగం చోరీకి గురికావడం అక్కడ తీవ్ర కలకలం రేపింది. రోజూ లాగే ఆలయంలో పూజలు నిర్వహించేందుకు తెల్లవారుజామున పూజారి.. ఆలయ తలుపులు తెరవగా.. అందులో శివలింగం కనిపించలేదు. అయితే శతాబ్దాల నాటి ఆ ఆలయంలో శివలింగం అతి పురాతనమైందని.. అక్కడి శివలింగాన్ని మహాదేవుడి విశ్వశక్తికి నిదర్శంగా భక్తులు విశ్వసిస్తారు. అలాంటి శివలింగం చోరీకి గురి కావడం సంచలనంగా మారింది. ఆలయ పూజారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి.. శివలింగాన్ని వెతికేందుకు గాలింపు ముమ్మరం చేశారు. ఆ పురాతన ఆలయంలోని రాతి శివలింగాన్ని దాని స్థానం నుంచి పెకలించి తీసుకెళ్లడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ పెకిలించి తీసుకెళ్లినట్లు తీసుకెళ్లారు. కేవలం శివలింగాన్ని మాత్రమే చోరీ చేశారని.. ఆలయంలోని మిగితా వస్తువులన్నీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఇది చేసింది మామూలు దొంగలు కాదని అనుమానిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: రష్మికకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పంపిన సమంత

100 మంది చిన్నారులకు బిర్యానీ వండి వడ్డించిన టాలీవుడ్ హీరోయిన్..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. క్లారిటీ…

Chhaava: ఒక్క రోజే 25 కోట్లు.. మొత్తంగా దిమ్మతిరిగే లెక్క! ‘ఛావా’ సంచలనం!

ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రభాస్ అలా కనిపించనున్నాడా?