చెప్పులే కదా అని చటుక్కున వేసుకుంటున్నారా.. పక్కకు తీసి చూడగా షాక్
ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్లే క్రమంలో చెప్పులు వేసుకునేందుకు వెళ్లాడు. అయితే తీరా చెప్పులు వేసుకునే సమయంలో అతడికి అనుమానం కలిగింది. చెప్పుల మాటున ఏదో ఉన్నట్లు డౌట్ రావడంతో వాటిని పక్కకు తీశాడు. కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. తీక్షణంగా చూస్తే అందులో ఏదో ఒక సమస్య లేదా ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది.
ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తీరా వేసుకునే ముందు చెప్పులు తీసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ముంబైలోని ఆరే కాలనీలో ఈ షాకింగ్ చోటు చేసుకుంది. చెప్పులను తీసి చూడగా దాని వెనుక అత్యంత విషపూరిత రస్సెల్స్ వైపర్ పాము చుట్ట చుట్టుకుని పడుకుని ఉంది. దగ్గరికి వెళ్లగా తల పైకి ఎత్తి కాటేసేందుకు ప్రయత్నించింది. అయితే చివరకు స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకుని బాటిల్‌లో బంధించాడు. వర్షాకాలంలో పాములు ఇళ్లల్లోకి వస్తుంటాయని అవి మూలల్ని వెతుక్కుని అక్కడే తిష్టవేస్తాయని స్నేక్ క్యాచర్ తెలిపారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. . ‘చెప్పులు కూడా చంపేయచ్చన్నమాట’.. అంటూ కొందరు, ‘చెప్పులు వేసుకునేందుకు కూడా చెక్ చేసుకోవాలా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం యువకుడి చందాలు.. ఏంటి మామా నీకు ఈ ఖర్మ
పొరపాటున గూగుల్‌లో ఈ విషయాలపై సెర్చ్ చేస్తే.. సీదా జైలుకే
వింతఘటన.. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతోందా..? వింతను చూసేందుకు ఎగబడ్డ జనం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

