సరదా అనుకున్నారు.. చావు దెబ్బ తిన్నారు.. పావురాలతో ఆటలా
పావురాల కాళ్లకు లైట్లు కట్టి రాత్రి పూట గాళ్లోకి ఎగురవేశారు. వాటిని డ్రోన్లుగా చిత్రీకరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజప్ఫర్‌నగర్‌లో వెలుగు చూసింది. ముజప్ఫర్‌నగర్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా రాత్రిపూట గుర్తుతెలియని డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి స్థానిక గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి. దీంతో అప్రమత్తమైన కొందరు గ్రామస్థులు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు షోయబ్, సాకీబ్ అనే ఇద్దరు యువకులపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా నిందితులు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. తామే పావురాల కాళ్లకు లైట్లు కట్టి రాత్రిపూట సమీప గ్రామాళ్లోకి వదులుతున్నట్లు ఇద్దరు యువకులు పోలీసులకు తెలిపారు. ఆ పావురాలనే ప్రజలు దూరం నుంచి చూసి వాటిని డ్రోన్లుగా భావించి భయాందోళనకు గురైనట్టు చెప్పారు. ఇద్దరు యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి నుంచి రెండు పావురాలు, ఒక పంజరం, రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఎల్‌ఈడీ లైట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెప్పులే కదా అని చటుక్కున వేసుకుంటున్నారా.. పక్కకు తీసి చూడగా షాక్
గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం యువకుడి చందాలు.. ఏంటి మామా నీకు ఈ ఖర్మ
పొరపాటున గూగుల్‌లో ఈ విషయాలపై సెర్చ్ చేస్తే.. సీదా జైలుకే
వింతఘటన.. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతోందా..? వింతను చూసేందుకు ఎగబడ్డ జనం
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

