జాలర్లకు చిక్కిన రూ.50 కోట్ల అంబర్‌ గ్రిస్‌.. ఏంచేశారో తెలుసా ??

|

Oct 09, 2022 | 1:29 PM

వేటకు వెళ్లిన ప్రతిసారీ జాలర్లు గంగమ్మకు మొక్కుకుంటారు. ఎక్కువ చేపల్ని లేదా బాగా విలువ చేసే జలపుష్పాలు చిక్కాలని కోరకుంటారు. ఆ గంగమ్మ దయతో.. మెడిసిన్ కోసం ఉపమోగించే అరుదైన చేప చిక్కింది అనుకోండి పండగే.

వేటకు వెళ్లిన ప్రతిసారీ జాలర్లు గంగమ్మకు మొక్కుకుంటారు. ఎక్కువ చేపల్ని లేదా బాగా విలువ చేసే జలపుష్పాలు చిక్కాలని కోరకుంటారు. ఆ గంగమ్మ దయతో.. మెడిసిన్ కోసం ఉపమోగించే అరుదైన చేప చిక్కింది అనుకోండి పండగే. అయితే, తాజాగా తమిళనాడులోని జాలర్లను మాత్రం అరుదైన అదృష్టం వరించింది. చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలల్లో ఏకంగా 50 కోట్ల రూపాయల విలువైన అంబర్‌ గ్రిస్‌ చిక్కింది. తొలుత వల భారీగా ఉండటంతో.. పెద్ద పెద్ద చేపల చిక్కాయేమో అనుకున్నారు. తీరా ఒడ్డుకు తీసుకొచ్చి చూడగా తిమింగళం వాంతిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే వారు దురాశకు పోయి దాన్ని అమ్ముకోడాని ప్రయత్నంచలేదు. నిజాయితీగా వ్యవహరించి అచ్చిరుపాక్కం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు. మొత్తం 38.6 కిలోల అంబర్‌ గ్రిస్‌ చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తిమింగలం వాంతి దొరికిన విషయాన్ని చెప్పిన జాలర్లు కల్పాక్కం సమీప కడపాక్కం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్‌, కర్ణన్‌, మాయకృష్ణన్‌, శేఖర్‌‌లను అధికారులు ప్రశంసించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకలితో ఉన్న ఆవు, దూడలు.. ఏమి పెడుతున్నాడో చూస్తే షాక్

నా భార్య మహిళ కాదు.. నాకు న్యాయం చేయండి.. కోర్టుకెక్కిన భర్త

కారు ఖరీదు రూ.11 లక్షలు.. రిపేరుకు మాత్రం రూ.22 లక్షలు..

అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకుని.. ఎలా మురిసిపోతున్నాడో చూడండి

సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్‌ వాటర్‌లో ఏముందో తెలుసా ??

Published on: Oct 09, 2022 01:29 PM