నా భార్య మహిళ కాదు.. నాకు న్యాయం చేయండి.. కోర్టుకెక్కిన భర్త

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెడతారు వధూవరులు. అలా కోటి ఆశలతో వివాహం చేసుకున్న ఓ వ్యక్తికి ఆరేళ్ల తర్వాత ఓ షాకింగ్‌ విషయం తెలిసింది.

నా భార్య మహిళ కాదు.. నాకు న్యాయం చేయండి.. కోర్టుకెక్కిన భర్త

|

Updated on: Oct 09, 2022 | 9:54 AM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెడతారు వధూవరులు. అలా కోటి ఆశలతో వివాహం చేసుకున్న ఓ వ్యక్తికి ఆరేళ్ల తర్వాత ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. తన భార్య అసలు మహిళే కాదని తెలుసుకున్న అతను షాకయ్యాడు. ఆరేళ్ల తర్వాత ఆ విషయం తెలిసి లబోదిబోమన్నాడు. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన యువకుడికి మురైనాకు చెందిన యువతితో 2016లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఐతే అప్పటి నుంచి వారి మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు. భార్య తీరుపై అనుమానం కలిగిన భర్తకు షాకింగ్‌ విషయం తెలిసింది. వివాహం జరిగిన ఆరేళ్లకు తన భార్య మహిళ కాదని, పురుషుడని, తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు సదరు భార్యతోపాటు, ఆమె తండ్రిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భార్యపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని ఏకంగా హైకోర్టులో పిటీషన్‌ వేశాడు. కానీ హైకోర్టు ఈ పిటీషన్‌ను తోసిపుచ్చింది. ఐతే పురుషుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు యువతి వాదన మరోలా ఉంది. తనకు హార్మోన్‌ సమస్య ఉండడం వల్లనే తాను ఇలా ఉన్నానని, అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు యువతి తెలిపింది. అయినప్పటికీ అనుమానం తీరని భర్త, తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాడు. దాంతో అతని వాదన నిజమేనని తేలింది. తన భార్యగా చెప్పబడుతున్న యువతి మహిళకాదని, పురుషుడని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ కేసును విచారించిన కోర్టు వివాహాన్ని రద్దు చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు ఖరీదు రూ.11 లక్షలు.. రిపేరుకు మాత్రం రూ.22 లక్షలు..

అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకుని.. ఎలా మురిసిపోతున్నాడో చూడండి

సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్‌ వాటర్‌లో ఏముందో తెలుసా ??

చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి.. వైరల్ వీడియో

106 మంది ప్రయాణికులతో ట్రైన్‌ అదృశ్యం !!

Follow us
Latest Articles
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం