చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి.. వైరల్ వీడియో
పెంపుడు జంతువులు చేసే అల్లరి తెగ ముచ్చటేస్తుంది. సోషల్ మీడియా పుణ్యామాని ఇటీవల ఫన్నీ సంఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి.
పెంపుడు జంతువులు చేసే అల్లరి తెగ ముచ్చటేస్తుంది. సోషల్ మీడియా పుణ్యామాని ఇటీవల ఫన్నీ సంఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చిప్స్‌ను ఎక్కువగా పిల్లలు తింటుంటారు. అందులో ఏదైనా బొమ్మ వస్తే తెగ మురిసిపోతుంటారు. అదే చిప్స్ ప్యాకెట్‌లో నిజమైన బొమ్మ వచ్చేస్తే బాగుండు అని చాలామంది అనుకుంటారు. కానీ, ఓచోట నిజమైన బొమ్మే వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజమైన బొమ్మ రావడమేంటి అనుకుంటున్నారా…? ఓ పిల్లాడు చిప్స్ ప్యాకెట్ కొనుక్కుని ఓపెన్ చేసి తినాలనుకున్నాడు. ఈ క్రమంలో సడన్‌గా ఆ ప్యాకెట్‌లోంచి పిల్లి బయటకు వచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. పిల్లి ప్యాకెట్‌లోకి ఎలా దూరిందనేది అందరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!

