Diamond: లీజుకు తీసుకున్న గనిలో దొరికిన విలువైన వజ్రం.. రూ.25 లక్షల విలువ.

వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ రైతుకు అదృష్టం వరించింది. బజారియా గ్రామంలో తాను లీజుకు తీసుకున్న గనిలో గత కొన్ని రోజులుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న రైతు దంపతులకు ఎట్టకేలకు నిన్న గులకరాళ్లు, మట్టితో పాటు మెరుస్తున్న రాయి కనిపించింది. దీనిని జాగ్రత్తగా తవ్వి వెలికి తీయండతో ఈ దంపతుల ప్రయత్నాలు ఫలించాయి.

Diamond: లీజుకు తీసుకున్న గనిలో దొరికిన విలువైన వజ్రం.. రూ.25 లక్షల విలువ.

|

Updated on: Jun 27, 2024 | 4:49 PM

వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ రైతుకు అదృష్టం వరించింది. బజారియా గ్రామంలో తాను లీజుకు తీసుకున్న గనిలో గత కొన్ని రోజులుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న రైతు దంపతులకు ఎట్టకేలకు నిన్న గులకరాళ్లు, మట్టితో పాటు మెరుస్తున్న రాయి కనిపించింది. దీనిని జాగ్రత్తగా తవ్వి వెలికి తీయండతో ఈ దంపతుల ప్రయత్నాలు ఫలించాయి. ఈ డైమండ్ విలువ లక్షల్లో ఉన్నట్లు అంచనావేస్తున్నారు. తాను లీజుకి తీసుకున్న గనిలో దొరికిన వజ్రంతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు ఆ రైతు. ఇప్పుడు ఆ రైతు ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. దేశ్‌రాజ్‌ అనే రైతుకు లీజుకు తీసుకున్న గనిలో 6.65 క్యారెట్ల ఈ డైమండ్‌ దొరికింది. వెంటనే ఆ వజ్రాన్ని పన్నా డైమండ్‌ ఆఫీసులో దేశ్‌రాజ్‌ డిపాజిట్‌ చేశాడు. త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో దీనిని ఉంచుతామని పన్నా డైమండ్‌ ఆఫీసు అధికారులు తెలిపారు. వేలంలో ఈ వజ్రం సుమారు 25 లక్షల రూపాయల వరకు పలుకుతుందని అంచనా వేశారు. ఇదే రైతుకు గతంలోనూ ఓసారి వజ్రం దొరికింది. మరోసారి రూ.లక్షల విలువైన వజ్రం దొరకడంతో అతడికి కాసుల పంట పండింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us