Haryana: రైతు ఖాతాలో రూ.200 కోట్లు జమ..! ఆ రైతు ఏం చేసాడో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు..
పేదవాడి అకౌంట్‌లో పెద్దమొత్తంలో నగదు ఉన్నా ప్రమాదమే. అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందంటూ ఆరాలు తీసి నేరాలు మోపుతారు. అదే భయం పట్టుకుంది ఓ రైతుకి. అతని బ్యాంకు ఖాతలో వచ్చి చేరిన 200 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియక, విషయం తెలిసితనకు ఎవరైనా అపాయం తలపెడతారేమోనని భయపడి గ్రామస్తులతో కలిసి పోలీసులను ఆశ్రయించాడు.
పేదవాడి అకౌంట్‌లో పెద్దమొత్తంలో నగదు ఉన్నా ప్రమాదమే. అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందంటూ ఆరాలు తీసి నేరాలు మోపుతారు. అదే భయం పట్టుకుంది ఓ రైతుకి. అతని బ్యాంకు ఖాతలో వచ్చి చేరిన 200 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియక, విషయం తెలిసితనకు ఎవరైనా అపాయం తలపెడతారేమోనని భయపడి గ్రామస్తులతో కలిసి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. చక్రీదాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్ వ్యవసాయం చేస్తుంటాడు. సెప్టెంబరు 7న అతను తన ఖాతాలో డబ్బు ఎంత ఉందో చూసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. తన ఖాతాలో 200 కోట్లు జమ అయ్యాయని బ్యాంకు వారు చెప్పడంతో అతడు షాకయ్యాడు. తన ఖాతాలోకి ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలియదని భయంతో విక్రమ్ కొందరు గ్రామస్థులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు అధికారులను అడిగి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. పూర్తి విచారణ చేశాకే అసలేం జరిగిందో, 200 కోట్లు విక్రమ్ ఖాతాలోకి ఎలా వచ్చాయో వెల్లడిస్తామని జిల్లా ఏఎస్పీ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..