Ropeway Accident: సహాయక చర్యల్లో అపశృతి.. హెలికాప్టర్ నుంచి కిందపడి వ్యక్తి..
ఝార్ఘండ్‌లోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. కాగా.. సహాయక చర్యల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైమానిక దళ సిబ్బంది ఓ వ్యక్తిని రక్షించే క్రమంలో
ఝార్ఘండ్‌లోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. కాగా.. సహాయక చర్యల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైమానిక దళ సిబ్బంది ఓ వ్యక్తిని రక్షించే క్రమంలో అతడు హెలికాప్టర్ నుంచి కిందపడి మృతిచెందాడు.గాల్లో ఉన్న హెలికాప్టర్ దగ్గరికి తాడు సాయంతో చేరుకోగలిగిన ఓ వ్యక్తి…కాక్‌పిట్ వద్దే వేలాడుతూ కనిపించాడు. కింద ఉండి ఇదంతా చూస్తున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. అతడు క్షేమంగా ఉండాలని దేవుడిని వేడుకున్నారు. అయితే అతడిని హెలికాప్టర్ లోపలికి లాక్కునేందుకు సైన్యం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాసేపటికే పట్టుతప్పి కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడు కిందపడిపోతుండగా.. ఆ దృశ్యాలను చూస్తున్నవారి హాహాకారాలు వీడియోలో వినిపించాయి. మృతిచెందిన వ్యక్తిని పశ్చిమ బెంగాల్ వాసిగా గుర్తించారు. దేవ్‌ధర్‌లోని బైద్యనాథ్ ఆలయ దర్శనానికి వచ్చే ప్రజలు.. త్రికూట పర్వతాల్లోని రోప్ వే ఎక్కుతుంటారు. అయితే ఆదివారం ఆ రోప్ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. దాదాపు 50 మంది అనేక గంటలపాటు రోప్ వే క్యాబిన్లలో చిక్కుకుపోయారు. ఈ త్రికూట్ రోప్‌వే భారత్‌లోనే ఎత్తయిన వర్టికల్ రోప్ వే, 766 మీటర్ల పొడువు ఉంటుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో