Robotic Mouse Viral Video: శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సరికొత్త రోబో ర్యాట్‌.. చుస్తే షాకే..

|

May 04, 2022 | 9:02 AM

సాంకేతిక వినియోగాన్ని మరింత విస్తృతం చేసేదిశగా శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా తమ ప్రయోగాలకు పదునుపెడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సరికొత్త రోబో ర్యాట్‌..


సాంకేతిక వినియోగాన్ని మరింత విస్తృతం చేసేదిశగా శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా తమ ప్రయోగాలకు పదునుపెడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సరికొత్త రోబో ర్యాట్‌ ఆవిష్కరణకు చైనాలోని బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ ప్రొఫెసర్‌ క్వింగ్‌ షి బృందం కృషిచేస్తోంది. దీని సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి విపత్తులు సంభవించిన చోట శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు, మనుషులు వెళ్లేందుకు క్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టడానికి దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇరుకైన ప్రదేశాల్లోకి వేగంగా చొచ్చుకెళ్లి మనుషుల ఆచూకీని గుర్తించడం సాధ్యమవుతుంది.ఇప్పటికే రోబోటిక్‌ ఎలుక నమూనాను డిజైన్‌ చేశారు. దాని శరీరపరిమాణం, రూపాన్నిబట్టి కాళ్లలో, నడుము, తలభాగంలో 2 డిగ్రీల వంపునకు వీలుగా స్ప్రింగ్‌ నమూనా సిద్ధంచేశారు. దీనికి సంబంధించిన నివేదిక ఐఈఈఈ ట్రాన్సాక్షన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. దీని బరువు 220 గ్రాములు. మొదట చక్రాల నమూనా డిజైన్‌చేశారు. అయితే, కదలిక చురుకుదనాన్ని మరింత మెరుగు పరచడానికి చక్రాలకు బదులుగా కాళ్లను అమర్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Published on: May 04, 2022 09:02 AM