Theft in Walgreens: రోజులు బావున్నాయి..రాత్రి రిస్క్ తీసుకోవడం ఎందుకు..పట్టపగలే బెటర్..ఘరానా దొంగతనం!

Theft in Walgreens:  కరోనా కాలం ఘరానా దొంగలకు బాగా కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. పట్టపగలే దర్జాగా దొంగతనం చేసి చక్కా పారిపోతున్నా ఎవరూ పట్టుకోలేని పరిస్థితి.

Theft in Walgreens: రోజులు బావున్నాయి..రాత్రి రిస్క్ తీసుకోవడం ఎందుకు..పట్టపగలే బెటర్..ఘరానా దొంగతనం!
Theft In Walgreens

Updated on: Jun 15, 2021 | 9:00 PM

Theft in Walgreens:  కరోనా కాలం ఘరానా దొంగలకు బాగా కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. పట్టపగలే దర్జాగా దొంగతనం చేసి చక్కా పారిపోతున్నా ఎవరూ పట్టుకోలేని పరిస్థితి. శాన్ఫ్రాన్సిస్కో లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక వాల్‌గ్రీన్స్ లో ఒక వ్యక్తి సైకిల్ పైవచ్చి గార్బేజ్ బ్యాగ్ నిండా స్టోర్ లోని సామానులు నింపుకుని దర్జాగా పారిపోయాడు. ఈ సంఘటన సెక్యూరిటీ గార్డ్ ముందే జరిగినా అతను వీడియో తీయడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఆ సమయంలో దుకాణంలో కూడా ఇతర సిబ్బంది కనిపించకపోవడం చెప్పుకోదగింది. ఆ వ్యక్తి సైకిల్ పై స్టోర్ లోకి వచ్చి బ్యాగ్ లో సామాన్లు నిముకున్నాడు. స్టోర్ విజిట్ కు వచ్చిన ఒక మహిళ, అక్కడ సెక్యూరిటీ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తీ ఈ సంఘటన వీడియో తీస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. సామాన్లు బ్యాగ్ నిండుగా నింపుకున్న తరువాత ఆ దొంగ సైకిల్ వేగంగా తొక్కుతూ స్టోర్ బయటకు వెళ్ళిపోయాడు. ఈ వీడియోను నగరంలోని కెజిఓ-టివి రిపోర్టర్ లియాన్నే మెలెండెజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఆ ట్వీట్ మీరూ చూసేయండి..

“శాన్ఫ్రాన్సిస్కోలోని గోఫ్ & ఫెల్ స్ట్రీట్స్‌లోని వాల్‌గ్రీన్స్ వద్ద ఇది జరిగింది. # పరిణామాలు. ” అని పేర్కొన్న ఆమె నగర జిల్లా న్యాయవాది చెసా బౌడిన్‌ను ట్యాగ్ చేసింది. ట్విట్టర్ లో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫాక్స్ న్యూస్ ఇచ్చిన ఇమెయిల్‌కు వాల్‌గ్రీన్స్ వెంటనే స్పందించలేదని తెలిపింది. అయితే, గత ఐదేళ్లలో వాల్‌గ్రీన్స్ నగరంలోని 17 దుకాణాలను మూసివేసినట్లు శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ రిపోర్ట్ చేసింది. ఈ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ పట్టపగలు దొంగతనం చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొందరు. సెక్యూరిటీ గార్డ్ డ్రస్ లో ఉన్న వ్యక్తీ వీడియో తీస్తున్నాడు కానీ, అతనిని ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు ఇది ఫేక్ అని అంటుండగా.. మరి కొందరు ఈ దొంగ ఎంత ఆకలితో ఈపని చేశాడో అని జాలి చూపించడమే కాకుండా..ప్రజలు తిండికి ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇంకేమి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఈ ట్వీట్ పై వచ్చిన కామెంట్స్ కొన్ని..



మొత్తమ్మీద ఈ పట్టపగలు దొంగతనం వీడియో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.