Ratan Tata: ఎంత ఎదిగిన ఒదిగా ఉంటడం అంటే ఇదే ఎమో..నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన రతన్ టాటా..
నిలువెత్తు నిరాడంబరతకు మారుపేరు రతన్ టాటా.. లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతైనా ఆయనలో ఎలాంటి గర్వం కనిపించదు. తోటివారి పట్ల ఎంతో దయాగుణంలో ఉండే ఆయన దాతృత్వంలోనూ ఎంతో ముందుంటారు. సందర్భం వచ్చిన..
నిలువెత్తు నిరాడంబరతకు మారుపేరు రతన్ టాటా.. లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతైనా ఆయనలో ఎలాంటి గర్వం కనిపించదు. తోటివారి పట్ల ఎంతో దయాగుణంలో ఉండే ఆయన దాతృత్వంలోనూ ఎంతో ముందుంటారు. సందర్భం వచ్చిన ప్రతీసారి ఇతరులకు సాయం చేయడంలోనూ ముందుంటారాయన. కొవిడ్ కష్టకాలంలో దేశం కోసం రూ.1500 కోట్లు విరాళమిచ్చిన రతన్ టాటా.. తమ సంస్థలో కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 20 నెలల బేసిక్ సాలరీని వన్ టైమ్ పేమెంట్ కింద చెల్లించారు. అంతేకాదు.. ఆ ఉద్యోగుల రిటైర్‌మెంట్ తేదీ వరకు వారి కుటుంబాలకు ప్రతీ నెలా బేసిక్ సాలరీలో సగం వేతనాన్ని చెల్లిస్తున్నారు. ఇలా సాయానికి, సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా టాటా మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన నానో కారులో వచ్చారు. పక్కన బాడీగార్డ్స్ కూడా ఎవరూ లేరు. హోటల్‌కు వచ్చే సమయానికి సిబ్బంది వచ్చి టాటాను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. టాటా తాజ్ హోటల్‌కు వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఎలాంటి సందడి లేకపోడం గమనార్హం. టాటా నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు కూడా టాటా సింప్లిసిటీని చూసి కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..