Viral Video: అబ్బా ఎంత గొప్ప మనసు.. కోడలికి రెండో పెళ్ళి చేసిన అత్తమామ.. రూ. 60 లక్షల ఆస్తి గిఫ్ట్‌గా కూడా..
మధ్యప్రదేశ్‌లో భర్తను కోల్పోయిన కోడలికి అత్తామామలే దగ్గరుండి మరో వివాహం జరిపించారు. అంతే కాదు.. 60 లక్షల విలువైన ఆస్తిని రాసిచ్చి ఆదర్శప్రాయంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లో భర్తను కోల్పోయిన కోడలికి అత్తామామలే దగ్గరుండి మరో వివాహం జరిపించారు. అంతే కాదు.. 60 లక్షల విలువైన ఆస్తిని రాసిచ్చి ఆదర్శప్రాయంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. యుగ్ ప్రకాశ్ తివారీ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్. ఈయనకు భార్య, కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. ప్రియాంక్ తివారీకి భార్య రీచా, తొమ్మిదేళ్ళ కూతురు అనన్య తివారీ ఉన్నారు. కరోనాతో ప్రియాంక్ తివారీ గతేడాది చనిపోయాడు. అప్పట్నుంచి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రీచా తన భర్త గురించే ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోతుండటాన్ని యుగ్ ప్రకాశ్ గమనించారు. దీంతో రీచాకు మరో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన వరుణ్ మిశ్రాతో రీచాకు దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అది కూడా అక్షయ తృతీయ రోజున వివాహం జరిపించి.. కొత్త జీవితాన్ని ప్రసాదించారు.నాగ్‌పూర్‌లో కుమారుడు కొనుగోలు చేసిన ఓ భవనాన్ని కోడలికి బహుమతిగా ఇచ్చారు. రీచా భవిష్యత్‌లో ఉన్నతంగా బతకాలనే ఉద్దేశంతోనే ఆ భవనం రాసిచ్చామని యుగ్ ప్రకాశ్ దంపతులు తెలిపారు. వివాహం అనంతరం వరుణ్ మిశ్రాతో కలిసి రీచా, కూతురు అనన్య నాగ్‌పూర్ వెళ్లిపోయారు. కోడలికి మరో పెళ్లి చేసిన యుగ్ ప్రకాశ్ దంపతులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!