వింత ఆచారం.. ఆ ఊరి అల్లుళ్లకు కట్నంగా ఎలుకలు !!
భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లి వేడుకలో నూతన వధువరులకు కానులు ఇవ్వడం సాంప్రదాయం. ఈ నేపథ్యంలో రకరకాల కానుకలు ఇస్తుంటారు.
భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లి వేడుకలో నూతన వధువరులకు కానులు ఇవ్వడం సాంప్రదాయం. ఈ నేపథ్యంలో రకరకాల కానుకలు ఇస్తుంటారు. కొందరు నగదు, వస్తువుల రూపంలో ఇస్తే.. మరికొందరు పెంపుడు జంతువుల రూపంలోనూ ఇస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా ఎలుకలను కానుకగా ఇస్తున్నారు. యేళ్లనాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గిరిజనుల ఎలుకలను ఆహారంగా మాత్రమే కాదు, వీటిని పెళ్లిళ్లలో ఎలుకలను కట్నంగా కూడా ఇస్తుంటారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు ఆడపెళ్లివారు తమ కూతుళ్లతోపాటు ఎలుకలను ఇచ్చి సాగనంపుతారట. అంతేకాదు ఏటా మార్చి 7న ఈశాన్య భారతదేశంలోని ఓ గ్రామంలో ‘యూనంగ్ ఆరాన్’ అనే ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ తమ ఇంటికి వచ్చే అతిథులకు ఆహారంగా ఎలుకలను వండి పెడతారు. ఇక్కడి గిరిజనులు అన్ని రకాల ఎలుకలనూ ఆహారంగా తీసుకుంటారు. క్రిస్మస్ రోజు పిల్లలకు బహుమతులు ఇచ్చినట్లే.. యూనంగ్ ఆరాన్ అనే పండగ రోజున పిల్లలకు కూడా ఎలుకలను బహుమతిగా ఇస్తారు. బొమ్మలతో ఆడుకున్నట్లు పిల్లలు వాటితో ఆటలాడుతారు. అన్ని మాంసాల కంటే ఎలుక మాంసమే చాలా రుచిగా ఉంటుందని, ఇంటికి వచ్చే అతిథులకు విందుగా ఎలుక మాంసాన్ని వడ్డిస్తామని చెబుతున్నారు గిరిజనులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాయం కానున్న వేపచెట్టు.. గుబులు పుట్టిస్తున్న వింత తెగుళ్లు !!
ఏం గుండె ధైర్యం రా వీడిది.. చిరుత దాడి చేసినా ??
అందరూ చూస్తుండగానే ఊహించని అలజడి.. ఒక్కసారిగా గుండె గుభేల్ !!