అందరూ చూస్తుండగానే ఊహించని అలజడి.. ఒక్కసారిగా గుండె గుభేల్ !!
సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది. పెద్ద జంతువులను సైతం అమాంతం మింగేస్తుంది. చిరుత, సింహం, పులి లాంటి వాటితో కూడా సమవుజ్జీగా పోరాటం చేస్తుంది.
సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది. పెద్ద జంతువులను సైతం అమాంతం మింగేస్తుంది. చిరుత, సింహం, పులి లాంటి వాటితో కూడా సమవుజ్జీగా పోరాటం చేస్తుంది. అలాంటి కొండచిలువలను విదేశాల్లో చాలామంది వ్యక్తులు తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. అయితే ఆ చర్యే తమ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా చేస్తుందని ఎవ్వరూ ఊహించరు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఓ ఇంట్లోని బాల్కనీలో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి పక్కనే ఉన్న గ్లాస్ బాక్స్‌ను తెరుద్దామని ప్రయత్నించాడు. ఇలా తెరిచాడో.. లేదో.. అలా కొండచిలువ బయటికొచ్చి అతడ్ని పట్టేసుకుంది. తన బలమైన దంతాలతో ఆ వ్యక్తి చేతిని పట్టుకుని అస్సలు వదిలిపెట్టలేదు. ఆ కొండచిలువ నుంచి అతడ్ని కాపాడేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించాల్సి వచ్చింది.
Published on: Dec 23, 2022 09:15 PM
వైరల్ వీడియోలు
Latest Videos