ఏకంగా శ్రీమహా విష్ణువును పెళ్లాడిన యువతి !! వైరల్ అవుతున్న వీడియో
దేవుళ్లను ఆరాధించడం, కష్టాల్లో ఉన్న తలచుకోవడం అందరూ చేసేదే. అయితే, కొందరు దేవుళ్లపై అమితమైన ప్రేమ పెంచుకుంటారు. మీరాబాయి అనే భక్తురాలు గురించి మనకు తెలిసిందే.
దేవుళ్లను ఆరాధించడం, కష్టాల్లో ఉన్న తలచుకోవడం అందరూ చేసేదే. అయితే, కొందరు దేవుళ్లపై అమితమైన ప్రేమ పెంచుకుంటారు. మీరాబాయి అనే భక్తురాలు గురించి మనకు తెలిసిందే. కృష్ణ భగవానుడిపై అమితమైన ప్రేమ పెంచుకున్న ఆమె చివరకు అతడిని పెళ్లి చేసుకుంది. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని నర్సింఘ్‌పూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల పూజా సింగ్ అనే యువతి మహా విష్ణువును పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 8వ తేదీన సంప్రదాయ పద్ధతిలో ఆమె శ్రీమహావిష్ణువును పెళ్లాడింది. ఆమె నిర్ణయం వెనక కారణం తెలిసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. ‘చిన్న చిన్న విషయాలకే భార్యభర్తలు గొడవపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయితే.. ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఆడవాళ్లే. అందుకనే విష్ణువును పెళ్లి చేసుకోవాలనుకున్నానని సదరు యువతి చెబుతుండటం విశేషం. 300 మంది బంధువుల సమక్షంలో విష్ణువు విగ్రహాంతో ఆమె పెళ్లి జరిపించారు కుటుంబసభ్యులు. ఇక ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజలు చేస్తూ గడపనున్నట్లు తెలిపింది పూజా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత ఆచారం.. ఆ ఊరి అల్లుళ్లకు కట్నంగా ఎలుకలు !!
మాయం కానున్న వేపచెట్టు.. గుబులు పుట్టిస్తున్న వింత తెగుళ్లు !!
ఏం గుండె ధైర్యం రా వీడిది.. చిరుత దాడి చేసినా ??
అందరూ చూస్తుండగానే ఊహించని అలజడి.. ఒక్కసారిగా గుండె గుభేల్ !!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

