జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం.. ఎందుకంటే ??

|

Jul 08, 2024 | 9:26 PM

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. భారీ బరువు ఉండే ఈ చేప.. అత్యంత అరుదుగా దొరుకుతుంది. మిలట్రీ మౌస్, గెలస్కోపి అని పిలువబడే ఈ చేప 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహానికి కొట్టుకొని వస్తుంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సీలేరు రిజర్వాయర్ లో జాలర్లు యదావిధిగా చేపలు వేటకు వెళ్లారు.

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. భారీ బరువు ఉండే ఈ చేప.. అత్యంత అరుదుగా దొరుకుతుంది. మిలట్రీ మౌస్, గెలస్కోపి అని పిలువబడే ఈ చేప 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహానికి కొట్టుకొని వస్తుంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సీలేరు రిజర్వాయర్ లో జాలర్లు యదావిధిగా చేపలు వేటకు వెళ్లారు. ఓ జాలరికి 11కిలోల అతి అరుదైన మిలట్రీ మౌస్ చేప వలకు చిక్కింది. దాన్ని వనములు నర్సింగ్ అనే మత్స్యకారుడు విక్రయించడానికి మార్కెట్ కు తీసుకువచ్చాడు. ఆ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈచేప 5 కిలోలనుంచి 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఈచేపలో 68శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఓమెగా 3ఫ్యాటీ అసీడ్స్ ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి. అల్లూరి ఏజెన్సీ కొండ ప్రాంతంఅడవుల్లో నిత్యం నీరు ఉండే ప్రాంతాలలో లోతైన సీలేరు, డొంకరాయి, బలిమెలా రిజర్వాయర్లలో ఈ చేపలుంటాయి. ఈ చేపలు నీటి ప్రవాహానికి ఎదురీదే అరుదైనలక్షణం కలిగి ఉంటాయి. కొండల మధ్య నీటి కొలనుల్లో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకొని రిజర్వాయర్ లోకి వస్తుంటాయని అంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Loan: తక్కువ వడ్డీ.. ఎక్కువ మొత్తం రావాలంటే ఏం చెయ్యాలి ??

యువకుడి మ‌ర్మంగాన్ని కోసేసిన మ‌హిళా డాక్టర్‌..ఎందుకో తెలుసా ??

Viral Video: భర్తకు దగ్గరుండి మూడో వివాహం చేసిన ఇద్దరు భార్యలు

ఈమే.. సంతాన లక్ష్మి !! ఒకే ఈతలో ఏకంగా కబడ్డీ జట్టునే కనేసింది

కంగనాను కొట్టిన CISF కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

 

Follow us on