1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం !!
ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైనదిగా, నాశనం కానిదిగా అభివర్ణించే పురాతన ఫ్రెంచ్ ఖడ్గం అదృశ్యమైంది. రోకమడోర్ అనే పట్టణంలో 1,300 ఏళ్లుగా ఓ 100 అడుగుల ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన కత్తి చోరీకి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 100 అడుగుల ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైందో అంతుబట్టక తలలుపట్టుకుంటున్నారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైనదిగా, నాశనం కానిదిగా అభివర్ణించే పురాతన ఫ్రెంచ్ ఖడ్గం అదృశ్యమైంది. రోకమడోర్ అనే పట్టణంలో 1,300 ఏళ్లుగా ఓ 100 అడుగుల ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన కత్తి చోరీకి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 100 అడుగుల ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైందో అంతుబట్టక తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ గా ఈ ఖడ్గం, దాని చరిత్ర నిలిచాయి. ఇప్పుడు ఆ కత్తి అదృశ్యం కావడంతో స్థానికులు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. వందల ఏళ్లుగా తమ పట్టణ చరిత్రతో ముడిపడి ఉన్న ఆ ఖడ్గం గురించి ప్రతి టూరిస్ట్ గైడ్ వివరించకుండా ఉండేవారు కాదని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు. డురండల్ గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. స్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఒక్క వేటుతో రాతిని కూడా అది రెండుగా చీల్చగలదు. 8వ శతాబ్దంలో ఆ ఖడ్గాన్ని ఓ దైవదూత, నాటి రోమన్ చక్రవర్తి చార్ల్ మేగ్నెకి అందించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ఖడ్గాన్ని తన అత్యుత్తమ సైనికుడైన రోలాండ్ కు బహూకరించారు. అయితే యుద్ధంలో మరణించే ముందు రోలాండ్ ఆ ఖడ్గం శత్రువుల చేతికి చిక్కరాదని భావించి దాన్ని విరగొట్టాలనుకున్నాడు. కానీ అది సాధ్యంకాకపోవడంతో అసహనానికి లోనై దాన్ని గాల్లోకి విసిరాడు. దీంతో ఆ కత్తి గాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరకు రొకమడోర్ పట్టణంలోని రాతికొండలో దిగబడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం.. ఎందుకంటే ??
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

